ప్రపంచజ్ఞానం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరి గ్రామం,నెల్లూరు.6392811961.
 జీవితంలో అనుభవాలు ఎన్ని ఎక్కువైతే  అంత ఎక్కువ ప్రపంచజ్ఞానం వస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు  ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క  ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది  పుస్తకాలలో చదివిన జ్ఞానం కన్నా మీ అనుభవ జ్ఞానం  పిల్లలకు నేర్పవలసి వుంది. నిన్న ఏం చేశాం అన్నీ మంచి పనులు చేశామా? ఏవైనా తప్పులు కూడా చేసామా మంచి పనులు చేస్తే దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు  మనకు తెలియకుండా మనం చేసిన పనిలో ఏదైనా తప్పు కనిపిస్తే  అమ్మ దానిని ఎలా తగ్గించుకోవాలో ఆ మార్గాన్ని తెలియజేస్తుంది. అమ్మ చెప్పే నీతి ఏమిటి  తప్పు చేయడం తప్పుకాదు  ప్రతి మనిషి తెలిసో తెలియకో ఒక తప్పు చేస్తాడు  అది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ జీవితంలో అలాంటి తప్పు జోలికి వెళ్ళకూడదు  అన్న పాఠం ఆ చిన్నారి మనసులో నాటితే  జీవితంలో అలాంటి తప్పులకు తావే ఉండదు. వేదాంతులు కూడా మనకు తెలియ చెప్పే  విషయం ఏమిటంటే  నిన్న జరిగిన ప్రతి విషయాన్నీ అనుభవంగా తీసుకో  ఇవాళ ఉదయం లేవగానే  రాత్రి నిద్రపోయే వరకు ఏ కార్యక్రమాలు చేయాలో నీ అంతట నీవే నిర్ణయించుకో  అలా ఎప్పుడు నిర్ణయానికి  వస్తాము  ఆ నిర్ణయాల్లో తప్పులకు అవకాశం ఉండదు  అప్పుడు భవిష్యత్తులో రాబోయే రేపటి గురించి  ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి అని ముందే ఆలోచించుకోవాలి  ఇవాళ మనం ఏం చేయాలనుకుని పూర్తి చేయలేకపోయామో దానిని ముందు పూర్తి చేయడం రేపు చేయబోయే పనులలో ముఖ్యమైన వాటిని  పూర్తిచేసిన తరువాతనే మిగిలిన వాటి జోలికి వెళ్ళాలి.   అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అమ్మ మీద కానీ, నాన్న మీద కానీ ఇంకా పెద్ద వారు ఎవరైనా ఉంటే  వారి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోకూడదు  అలా నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయం తీసుకున్నది తనే కనుక ఆ పనిని ఎలా పూర్తి చేయాలో కూడా తనకే తెలుస్తోంది.
ఏదైనా పని చేయవలసి వస్తే  మంత్ర తంత్ర యంత్ర సమన్వితం అని మన పెద్దలు చెప్పారు. ముందు తంత్రం మనకు తెలియాలి ఒక కాగితం తీసుకుని మనం ఏది చేయదలుచుకున్నామో దానిని పద్ధతిగా ముందు రాసుకోవాలి  ఉదాహరణకి ఇల్లు కట్టాలి  ఆ ఇంటికి ఎన్ని గదులు వుండాలి  ఏ గది ఎక్కడ ఉండాలి, ఏ దేవుడు ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా నిర్ణయించుకొని  ఆ తర్వాత దానిలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారి సహాయం స్వీకరించి వారి చెప్పిన మంచి సూచనలను  తీసుకొని నిర్మాణం ప్రారంభిస్తారు అక్కడ  యంత్రాంగం అవసరం రాళ్లు మోసే అతని దగ్గర నుంచి కట్టే మేస్త్రి వరకు  అప్పుడు ఆ పనిని  సుసాధ్యం చేయగలవు  ఆ పని చేసే ముందే  అమ్మను నాన్నను  సంప్రదించి  ఈ పని మనం చేయగలమా లేదా  మన పరిస్థితి ఎలా ఉంది  ఆర్థిక పరిస్థితి లేకపోతే ఏమీ చేయలేం కదా దానిని దృష్టిలో పెట్టుకుని మన ఏర్పాట్లు మనం చేసుకుంటే  జీవితం ఆనందమయంగా ఉంటుంది అంటే అమ్మ నాన్న కూడా ఎంతో ఆనందిస్తారు యువత అలా చేయడానికి ప్రయత్నిస్తోందని నా ఆశ.... అమ్మలూ ఆ మార్గంలో నడిపిస్తారు కదూ....


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం