* డబ్బు పొగరు*;--- డి అభిషేక్ రెడ్డితరగతి: 8వ ఏ సెక్షన్స్కూల్: జిల్లా పరిషత్, సిద్దిపేటసెల్ నంబర్ :9704105200.
 ఒకానొక సమయంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక సర్పంచ్ ఉండేవాడు. అక్కడ ఏ సమస్యలు వచ్చిన వాటిని పరిష్కారిస్తాడు. అక్కడ ఒక డబ్బున్న వ్యక్తి డబ్బులు ఉన్నాయని పొగరుతో అందరిని చిన్న చూపుతో చూసేవాడు. అక్కడ ఒక బీద కుటుంబం ఉండేది. ఆ సర్పంచ్ ఇంకా డబ్బున్న వ్యక్తి వీళ్ళ కుటుంబాన్ని పని వాళ్ళుగా చూసేవారు. అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. తరువాత ఈ బీద కుటుంబంలో ఉన్న వాళ్ల కూతురిని.ఈ డబ్బున్న వాళ్ళ ఇంట్లో పని చేపిస్తున్నారు. ఆమె చదువుకునే వయసులో పని చేపిస్తున్నారు డబ్బు పొగరుతో.ఆమెని కష్టం పెడుతున్నారు.అది వాళ్ళ కుటుంబానికి నచ్చలేదా వాళ్ళు పక్క గ్రామం లోకి వెళ్లారు. అక్కడ ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. అందులో కొంచెం నష్టం అనేది వచ్చింది. అయినా వ్యాపారం సాగించారు అట్లా వాళ్ళ జీవనం సాగించారు. ఇప్పుడు కొంచెం లాభం అనేది కలిగింది. ఆ వ్యాపారాన్ని కొంచెం పెద్దగా చేశారు. ఆ డబ్బున్న వ్యక్తి కొన్ని సమస్యలు వల్ల  బిచ్చగాడిలా మారిపోయాడు. వీళ్ళ వ్యాపారంలో ఒక మనిషి  కావాలని బోర్డు వేస్తారు. ఆ బోర్డు ని చూసి నాకు పని కావాలని వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వీళ్లు అతనిని గుర్తుపట్టి మాకు ఒక మనిషి కావాలి అని అంటారు. అది విన్న బిచ్చగాడు సరే అని అంటాడు. వీళ్లు ఆయనను పనిలో పెట్టుకుంటారు. ఆయన అని అన్నాడు. ఆ డబ్బు ఉన్న వ్యక్తి తన తప్పులు తెలుసుకొని క్షమాపణ అడుగుతాడు.

 నీతి : డబ్బులు ఉన్నాయని పొగరుతో ఏ మనిషినైనా తక్కువ చూడకూడదు. ఏ మనిషికైనా ఒక సమయం రావచ్చు. అందుకని అందరిని సమానమే చూడాలి. డబ్బులు ఉన్నా లేకపోయినా అందరినీ ఒకేలా చూడాలి.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం