శిరోవేదన మథనం;-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకులు, 8555010108.
ఒక్కోసారి మది పరిగెత్తే కుందేలు  
అలసి సొలసి ఆరోగ్యం కుదేలు 
సాధ్యాసాధ్యాలు దానికి అనవసరం
నీవుగా బతికితే అనంత ఆనందం
తోటివారితో పోలిక కుంగుబాటుకు మూలం !

నిన్ను నీవుగా అంచనా వేసుకో 
అత్యాశ లోతు తెలియని బురదకుంట  
అందమైన తామర పూలతో ఆకట్టుకుంటుంది
తలకు మించిన బరువైతే తప్పదు శిరో వేదన 
ప్రతి నిత్యం ధ్యానయోగతో బుద్ది వికాసం !

ప్రతి జీవికి కష్టాలు కన్నీళ్లు సహజం 
ఒక్కోసారి చుట్టుముట్టే సమస్యల వలయం                                       
మోయలేని భారంతో గుండె చెరువైతే
ఒత్తిడికి తడబడటం కాదు నిలబడటం నేర్వాలి !

చెట్టు చిగురించాలన్నా..! 
పండుటాకు రాలాలన్నా..!
శైశవం వృద్ధాప్యంగా మారాలన్నా..! 
నిలువెత్తు కాలానిదే నిర్ణయాధికారం
కాలం చేసిన గాయం మానని దేహాలెన్నో..!
ఎంత చదివినా ఒడవని కావ్యం అనంత విశ్వం !

ఆనందం ఆశ కవల పిల్లలు కాదు 
ఓ తీయని అనుభూతి ఆనందం
ఉన్నంతలో తృప్తిపడే తత్త్వం 
ఆశ కడదాక విషాదాన్ని మోసుకొస్తుంది ! 

నీలోని భావోద్వేగాల నియంత్రణ
ప్రతికూల ఆలోచనలకు ముగింపు
చేదు జ్ఞాపకాలకు పాడాలి చరమగీతం 
సరైన జీవనశైలి సమస్యల పరష్కారమార్గం !



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం