సాగిపోతాంది;-సి. శేఖర్(సియస్సార్),పాలమూరు,9010480557.
 నవజీవనగమనం
నరకయాతనతో సతమతమౌతూ
నరులందరూ పరాయికరణను సింగారించుకుని
ఎవరికివారే ఒంటరైతున్నరు
పక్కనేవున్నా
పలకరింపులసలుండని కాలమిది
సమాంతర రేఖలై కదిలిపోతున్న మనిషినైజం
ఎవరికివారే లక్మణరేఖలు గీసుకుని 
చేయుతనివ్వని చేతులతో
తమేర్పరచుకున్న  పరిధిలో బందిలైపోతున్నరు
మనసంతా అహంభావం
తనువంతా అహంకారం
బంధాల్ని తెంచుకోవడమే అలంకారం
వదిలేసుకోవడమే నేడందరి అభిప్రాయం
ఆకర్షణీయమైనదేది లేదిపుడు
విమర్షించడమే ధ్యేయం
జుట్టు కాళ్ళు అనే ఆటే
ఇష్టమైన క్రీడావినోదం

కామెంట్‌లు