మనిషి ఆశాజీవి కోరికలు అనంతం. భగవంతుని కి ఒక నారీకేళం సమర్పించి అవసరానికి మించిన కోరికలు కోరుతాడు. కోరికలు ఫలిస్తే సంతోషిస్తాడు. కోరికలు ఫలించనిచో నిరాశ చెందుతాడు. మనిషి కోరికలు పరుగెత్తే గుర్రాల లాంటివి, మనస్సనే కళ్లెంతో బంధిస్తే కోరికలు అదుపులో ఉంటాయి. మనిషిలోని కోరికలు తేనె తుట్టే లాంటివి. కోరికలు మూకుమ్మడిగా నెరవేరవు ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవాలి. అలాంటిదే ఈ కథ.....
కోరికలను జయించడం కష్టం. ఒక కోరిక తరువాత మరొక కోరిక పుడుతూనే ఉంటుంది. ఇందుకు భారతంలోని యయాతి తర్వాత మరో కథ చూడవచ్చు. దైత్య గురువు శుక్రాచార్యుని శాపం వల్ల
యౌవనాన్ని కోల్పోయిన యయాతి తనకు యౌవనాన్ని బదిలీ చేయమని నలుగురు కొడుకులను కోరాడు. వారు తిరస్కరించారు. యయాతి కోసం ఏ స్థాయికి చేరిందంటే, అతను తనది అనుచితమైన కోరికైనా దానికి అంగీకరించని తన కుమారులు నలుగురిని శపించాడు. దానికి కారణం లోపల అంత బలంగా ఉన్న కోరిక. తన యౌవనాన్ని దానం చేస్తానని. ముందుకు వచ్చి అంగీకరించిన ఒక్క కొడుకు ఇచ్చిన యవ్వనాన్ని తీసుకున్నాడు. ఒక వెయ్యేళ్ళ పాటు యౌవనం కొడుకు ఆయనకు ధారపోసాడు ఆ యుగంలో మానవుల ఆయుర్దాయం వేల ఏళ్లు ఉండేది. వెయ్యేళ్లు సుఖ భోగాలు అనుభవించిన తర్వాత కోడుకుతో ఆయన అన్న మాట ఇది..అనుభించడం వల్ల కోరిక నశించదు. తృప్తి లభించదు. నేయి పోస్తున్న కొద్దీ అగ్ని మరింత ప్రజ్వలించినట్లు విషయాలను అనుభవించిన కొద్ది కోరిక పెరుగుతుంది.
ఇది అన్ని కోరికలకూ వర్తిస్తుంది. డబ్బు సంపాదించే వాడికి ఇంకా కావాలనే కోరిక పెరుగుతూనే ఉంటుందంటారు ఇదే. దీనికి అందరికీ తెలిసిన జానపదుల కథ కూడా ఉంది. నీతిని బోధించడానికి పెద్దలు చెప్పిన కథ ఇది. ఒక వ్యక్తి తీవ్ర తనస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి దేవుడు నువ్వు కొరకున్నప్పుడు మరణం వచ్చే వరం ఇస్తాను అన్నాడు. అయితే ఈ మధ్యలో యమ భటులు వచ్చి హెచ్చరిస్తుంటారు అని షరతు పెట్టాడు. ఆ వ్యక్తి కొంతకాలం జీవించాక ఒక రోజు యమ భటులు వచ్చి వస్తావా అని అడిగారు. అందుకు అతను నాకు పెళ్లయి. నా పిల్లలు లేరు సంతానం కలిగాక వస్తానన్నాడు. పిల్లలు పుట్టాక వచ్చి వారు వస్తావా అని అడిగారు. మనుమలు పుట్టాక వస్తా న్నాడు మనవలు పుట్టాక వారు వచ్చి వస్తావా అని అడిగారు. మనవ లకి పెళ్లిళ్లవనీ అన్నాడు. ఆ తర్వాత కొంత కాలనికి యమ భటులు వచ్చి వస్తావా అని అడిగారు. మునిమనవల్చి చూడాలని ఉంది అని అన్నాడు. ఎంతకాలం గడిచినా అతనికి విసుగు పుట్లలలేదు కోరికలు ఉంటూనే ఉన్నాయి. కాని వయసుతో శరీరంలో రుగ్మతలు చాలానే చోటు చేసుకున్నాయి. వాటితో బాధపడుతూనే జీవించడంమొదలు పెట్టాడు. కొన్నాళ్లకు వాటి బాధ ఎక్కువైంది. ఆ రోగ బాధలు భరించలేక అప్పుడు యమ భటుల రాకకై వేచి చూశాడు. ఒకరోజు వారు వచ్చారు. వస్తావా అన్నారు. నాకు ఇంకా జీవించాలనే ఉంది కాని ఈ వ్యాధుల బాధలు భరించలేకపోతున్నాను తీసికెళ్ళండి అని అన్నాడు. అప్పటికీ అతనికి బతకాలన్న కోరిక ఉంది కాని రోగ బాధ భరించలేకనే మరణాన్ని కోరాడు కాని ఆశతగ్గి కాదు. ఇలా ఉంటుంది కోరికల పోకడ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి