బాల పంచపది
=============
1. సీతామాత సహనము!
అశోకవనాన కవచము!
రావణ వాచాలత్వము!
గరికతో మౌన సమాధానము!
ఓర్పు ,కష్టాల ,
కాచే కవచము ,రామా!
2.భూమాత అమితసహనము!
మానవ జీవన ఆదర్శము!
మొక్కవోని ఆ సద్గుణము!
మనిషికి మౌన సందేశము!
ఓర్పు ,కష్టాల ,
కాచే కవచము, రామా!
3.సహనమంటే సత్యాగ్రహము!
స్వరాజ్యసమరవజ్రాయుధము!
ఆది మహాత్మునిఆవిష్కారము!
పరాయిపాలన బహిష్కారము!
ఓర్పు, కష్టాల,
కాచే కవచము, రామా!
4. కాదు,ఓర్పు,
చేతకానితనము!
నేర్పు సాధించే,
ఉత్తమ సమయము!
విజయానికి,
మౌన వ్యాఖ్యానము!
ప్రజ్ఞ ప్రతిజ్ఞగా ,
రూపాంతరము!
ఓర్పు ,కష్టాల,
కాచే కవచము, రామా!
5.అసహనము కోపకారణము!
కోపంతో బుద్ధి మాంద్యము!
బుద్ధిహీనత అనర్ధాలకేంద్రము!
సహనమే జీవన మూలము!
ఓర్పు. కష్టాల,
కాచే కవచము, రామా!
6. ఓర్పు ,
తనకు తాను ఓదార్పు!
తీర్పు ,
కోసం చూసే తూర్పు!
ఓర్పుతోనే,
సాధ్యం ప్రతి మార్పు!
ఓర్పు లేకుంటే,
లేదు ఏ చేర్పు!
ఓర్పు ,కష్టాల,
కాచే కవచము, రామా!
7. ఓర్పు తోనే,
సాధ్యం తపస్సు!
తపస్సు తోనే,
జ్ఞాన ఉషస్సు!
తప్పక తొలగు,
అజ్ఞాన తమస్సు!
కలుగు మనిషికి ,
దివ్య తేజస్సు!
ఓర్పు ,కష్టాల ,
కాచె కవచం రామా!
_________
కవచము!;-డా. పి. వి.ఎల్. సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి