అభయం!;-డా .పి.వి.ఎల్. సుబ్బారావు, 9441058797.
బాల పంచపది
=============
1. ఆయుః "జీవితం",
            వేదం "శాస్త్రము!"
   అక్షరాల ,
              జీవిత శాస్త్రము!
   ఆరోగ్యమే ,
         జీవనాన ముఖ్యము!
   చికిత్స ,
            తరువాతి అంశము!
   ఆయుర్వేద వైద్యం,
              అభయం, రామా!

2. ప్రపంచాన ,
           పురాతన వైద్యము!
   చరక సంహిత,
             చక్కని  సాక్ష్యము!
  కరోనా కాలాన ,
                 సరి విధానము!
  ఇంటజరిగే,
             మేటి నివారణము!
  ఆయుర్వేద వైద్యము,
         అభయం, రామా!

3. ముందు ,
                 సరి నిర్ధారణ,!
    తరువాత ,
          సంపూర్ణ నివారణ 
    పక్క ప్రభావాలు ,
               లేని ఆదరణ! 
   విశ్వాన ,
     భారతీయ బహుకరణ!
   ఆయుర్వేద వైద్యం ,
         అభయం, రామా!

4. పాలు ,
           తాజా పళ్ళు కూరలు!
    సాత్విక ,
      వంటకాలతో భోజనాలు!
     నిత్యం ,
               యోగా విధానాలు!
     ధన్వంతరి కృప,
               ఆయుర్వర్ధకాలు!
    ఆయుర్వేద వైద్యం,
             అభయం , రామా!
________


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం