మథుర లబానా ప్రజల కొంగు బంగారం అమ్మ జ్వాలాముఖి;-రాథోడ్ శ్రావణ్;-లెక్చరర్, ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లా,9491467715
 దసర సందర్భంగా ముస్తాబైన మాత జ్వాలాముఖి ఆలయం. ఆలయంలో ఋషి పంచమి, దసరా పండుగ, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో సంబురాలు జరుగుతాయి
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అందునాయిక్ తాండలో 
 మథుర లబానా కులాలకు చెందిన పుణ్యక్షేత్రం జ్వాలాముఖి ఆలయం ఉంది.ఈ ఆలయాన్ని భారతదేశంలోనే  ప్రసిద్ధి చెందిన   అమ్మా జ్వాలాముఖి  ఆలయంలో ఒకటిగా భక్తులు విశ్వసిస్తారు.అడవుల జిల్లా చుట్టూ కొండల మధ్యలో
పచ్చని ప్రకృతి మధ్య అందునాయిక్ తాండలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న మాత జ్వాలాముఖిని శరణు కోరితే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
అందుకే భక్తులు  సైతం అమ్మ జ్వాలాముఖి కరుణా కటాక్షాలు తమ‌ పైన ఉండాలని దేవిని పూజిస్తారు.జగాన్ని పాలించే ఆ జగజ్జనని అందునాయిక్ తాండలో కొలువై భక్తుల పూజల్ని అందుకుంటుంది.అమ్మవారి ఆలయం విశిష్టతను సంతరించుకోవడంతో
ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరడమే కాక, మోక్షం కూడా లభిస్తుందని  పెద్దలు చెపుతారు. 
పూర్వ ఆధారము:-
మాత జ్వాలాముఖి ఆలయంలో కుడి ప్రక్కన దేవి శిష్యులు సంత్ శ్రీ కాలుబాబా,   ఎడమవైపున సంత్ శ్రీ పాచుబాబా విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. వీరిద్దరు దేవి జ్వాలాముఖి ముఖ్య శిష్యులు అని భావిస్తారు. ఇరువురు మాత జ్వాలాముఖిని జపిస్తూ తపస్సు చేయడంతో జగన్మాత  ప్రత్యేక్షమై మీరు కోరిన కోర్కెలు నెరవెరుతాయని చేప్పడంతో  శిష్యులు మాతకు  పూజలు చేయడం ప్రారంభించారు.వారు  అనుకున్న కోరికలు తపస్సు వలన  నెరవేరిందని శిష్యులు సంతోషం చెంది మాత జ్వాలాముఖి దివ్య ఆశీస్సులు తీసుకోని దేవి పూజలు ప్రారంభించారు. అప్పటి నుండి కోరిన కోరికలు నెరవేరడం, వర్షాలు సకాలంలో పడి పంటలు సమృద్ధిగా పండడం వలన కష్టసుఖాల్లో మాత జ్వాలాముఖి  మథుర లబానా ప్రజలకు అండగా నిలిచిందని భక్తుల విశ్వాసం.అని పూర్వీకులు చెబుతుంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు
వారి నుండి తరతరాలుగా వచ్చిన ఈ ఆచారాన్ని ఖైతిలబానా మథురా కులానికి చెందిన భక్తులు అమ్మ జ్వాలాముఖిని  తమ కుల దేవతగా భావించి దేవి భక్తులైన మహారాజ్ కాలుబాబా,పాచుబాబాను తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్షమున ఐదో రోజున ఋషి పంచమి పండుగను ఖైతిలబానా మథురా కులస్థులు పెద్ద ఎత్తున దేవి శిష్యుల పేరట ఋషి పంచమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. 
ప్రతి సంవత్సరం ఋషి పంచమి వేడుకలు:-
_________
ఈ ఋషి పంచమి ఉత్సవాలలో పాల్గొనడానికి భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, హర్యానా  ప్రాంతాలకు చెందిన  భక్తులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దేవి దర్శనానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు,సంతులతో పాటు
 దాదాపు పది వేలకు పైగా భక్తులు హాజరై అమ్మ వారిని  దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
ఇచట అమ్మ వారిని మనం కోరుకున్న విధంగా మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. అమ్మవారు అగ్ని స్వరూపమే ఈ జ్వాలాముఖి తల్లిగా కొలిస్తే కోరిన శుభాలు కలుగుతాయని విద్య, వివేకం,ధనసంపద, సంతాన సంపతి, ఇలా ఒకటి ఏంటి జీవితంలో నెగ్గుకురావడానికి కావాల్సిన అష్టెశ్వర్యాలనూ కూడా అమ్మవారు ప్రేమతో ప్రసాదించును. అమ్మవారు మథురా ప్రజలకి ఇలవేల్పు.అమ్మవారి కోలాహలం చూసి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జ్వాలాముఖి ఆలయం పీఠాధిపతి శ్రీ సంత్ రాంసింగ్ జీ మహారాజ్ గారి అధ్వర్యంలో అమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు.అనంతరం కుల గురువు రాంసింగ్ మహారాజ్ యొక్క ఆశీస్సులు అందుకుంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మ.. అగ్ని స్వరూపము అని భక్తులు విశ్వసిస్తారు.చల్లని చూపులతో చిరుమంద హాసంతో కనిపిస్తూ ప్రేమ,కరుణ, వాత్సల్యం కురిపిస్తుంది అని అంటారు. జ్వాలాముఖి దేవి వివిధ వర్ణంలో మెరిసిపోతూ అగ్ని జ్వాలలై తన బిడ్డలను కాపాడుతుందని అంటారు.
ఆలయ ఆకృతి:-
ఆలయం అందమైన కలాకృతులలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఆలయం శిఖరము ఎత్తు దాదాపు (50) యాభై ఫిట్లు పైన ఉంటుంది.ఆలయం బంగారు వర్ణంలో కళకళలాడుతూ ఉంటుంది.లోపల విభిన్న రకాల ఆకృతిలో దేవతా మూర్తులు చుపురులను ఆకట్టుకుంది.
శరన్నవరాత్రులు మహోత్సవం:-
_________
దసరా  పండుగను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక విద్యుత్తు కాంతులను ఏర్పాటు చేసి, ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరిస్తారు.
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సంత్ రామ్ సింగ్ జీ మహారాజ్ , తాండ నాయక్ చోపాడే షకీరా నాయక్ గార్ల ప్రత్యేక  పర్యావేక్షణలో  తేది:26 సెప్టెంబరు 2022 నుండి తేది:04 అక్టోబరు 2022‌,వరకు జ్వాలాముఖి ఆలయంలో  దుర్గమ్మ "జ్వాలాముఖి"అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, వస్త్రాలు ఆభరణాలతో పాటు నైవేద్యాలు సమర్పించి మహాప్రసాదం నిర్వహించారు.అదే  రోజున  తాండ వాసులు భోజనాలు ముగించుకొని రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఆలయ ఆవరణలో మహిళలు, యువతులతో  ప్రత్యేక దాండియా నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు  నిర్వహించారు.
సాంప్రదాయ నృత్యాలు:-
_________
ఋషి పంచమిని పురస్కారానికి చేసుకొని ఆలయ ఆవరణలో  వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేరువేరుగా సాంప్రదాయ నృత్యాలు చేస్తూ వాళ్ళ మథురా భాషలో పాటలు పాడుతూ కోలాట నృత్యాలు చేస్తారు. నృత్యకారులు రంగు రంగుల ఎక రూప సాంప్రదాయ దుస్తులను ధరించి బాజాబజంత్రుల మద్య వృత్తాకారంలో నిలబడి నృత్యాలు చేస్తుంటే చూపురలను ఆకట్టుకుంది. మహిళలు సాంప్రదాయ రంగురంగుల వస్త్రధారణలు ధరించి పాటలు పాడుతూ జియె,జియె నృత్యాలు చేస్తారు.ఈ మహిళల నృత్యాన్ని "లభాన్ ఛోరికో ఖేల్" అని అంటారు.పురుషులు ఆలయం ప్రాంగణంలో నృత్యాలు చేస్తుంటే మరికొందరు చదరంగం ఆటలను ఆడుతూ వారి సంస్కృతి సంప్రదాయాలను  గౌరవిస్తూ భావి తరాలకు అందించటం శుభ పరిణామం.
జాతర రెండు రోజులు:-
ఋషి పంచమిని పురస్కారానికి చేసుకొని  జాతర రెండు నుండి మూడు రోజులు నిర్వహించడం ఆనవాయితీ. జాతరకు వచ్చే భక్తులకు అమ్మ జ్వాలాముఖి ని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. జాతరలో  మిఠాయి తినుబండారాలు దుకాణాలు, టీ, కాఫీ వివిధ రకాల తినుబండారాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. భక్తులకు తాండ నాయక్ చోపాడే షకీరా నాయక్ గారి ఆధ్వర్యంలో సమస్త గ్రామస్తుల సహకారంతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి మహిళలు పిల్ల పాపలు అందరు భోజనాలు చేసి వాళ్ళ గ్రామానికి పయానమౌతారు.


కామెంట్‌లు