వేషం ముఖ్యం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 వేమనను మీ కులం ఏమిటి అని అడిగినప్పుడు కులం అంటే అర్థం తెలిసి అడుగుతున్నావా?  తెలియనప్పుడు ఎంత చెబితే నీకర్థం అవుతుంది కులము అంటే విభజన. విభజన ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది  ఒక ఇంట్లో  నలుగురు పిల్లలు ఉన్నారు  అమ్మ అందరికి ఒకే రకంగా భోజనం వడ్డిస్తుంది. అందరూ ఒకే రకంగా తింటూ ఉంటారా?  వారిలో ఆకలి ఒక మాదిరిగానే ఉంటుందా? ఎక్కువ తక్కువ ఉండవా? బాగా ఆకలి అయ్యేవాడు  గబగబా నమలకుండానే తింటాడు. ఆకలి లేకుండా కూర్చున్నవాడు  అటు కెలికి ఇటు కెలికి అంతా ఆగం చేస్తూ ఉంటాడు. నలుగురు నాలుగు రకాలుగా తింటూ ఉంటారు ఒకరిని చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంటుంది మరొకటి చూస్తే అసహ్యం గా ఉంటుంది  నలుగురిది ఒకే రక్తం ఎందుకు ఈ భేదాలు వచ్చాయి. వారిని వేరువేరుగా కూర్చో  పెడదామా? వీరిలో బుద్ధికుశలత కలిగిన వాడికి ఒక రకమైన గౌరవం. అది లేని వాడిని కొంచెం తక్కువ గౌరవం. సమాజంలో జరుగుతున్న విషయమే  ఏదైనా సలహా కావాలి అంటే  పరిష్కార మార్గాన్ని సులువుగా చెప్పేవాడిని అడుగుతాడు లేకపోతే వేరే వాళ్ళని ఆశ్రయిస్తామని అంటాడు. అలాగే  కులాలు మతాలు ఏర్పడ్డాయి అని చెబుతూ  వేష భాషల వల్ల వారి వ్యక్తిత్వం తెలుస్తుంది అని కొంతమంది అంటారు.  కొత్త దుస్తులు ధరించి ఆకర్షణీయంగా వున్నంతమాత్రం చేత అతనిని మర్యాదగా చూసి మురికి చొక్కాతో వచ్చినవాడిని చిన్న చూపు చూస్తూ ఉంటే  సరిగా అర్థం చేసుకున్నట్లు  వారి ప్రజ్ఞాపాటవాలు చూసి గౌరవించడంలో  మన విజ్ఞత కూడా తోడు కావాలి. లేకపోతే అనర్హులకి స్థానం ఇచ్చినట్లు అవుతుంది. సమాజంలో అలాంటి హెచ్చుతగ్గులు ఉండకూడదు అనేది నినాదం.
ఉన్నత వంశంలో పుట్టినం తమాత్రం చేత అతనికి గౌరవము ఇస్తున్నారు. ఎంత ధనవంతుడైన మురికి బట్టలతో స్తాన సంధ్యలు చేయకుండా కేశ సంస్కారాన్ని  వదిలివేసి  సమాజంలోకి వస్తే  అతనికి పెద్దపీట వేసి  భజన చేస్తారా. ఆ ప్రాంతానికి రావడానికి వాడిని  అనుమతించరు కూడా. ప్రజలు అలా అసహ్యించుకునే స్థితికి మీరు రాకండి. మీ మర్యాద మీరు కాపాడుకోండి అని చెప్పడం కోసమే వేమన ఈ పద్యాన్ని మనకందించాడు. దీనిలో పోలికలు కాదు విషయాన్ని మాత్రమే స్వీకరించండి అంటాడు వేమన ఆ పద్యాన్ని మీరు కూడా చదవండి.
మైల కోక తోడ మాసిన తల తోడ 
నొడలు మురికి తోడ నుండె నేని  
నగ్ర కులజుడైన నట్టిట్టు పిలువరు..."


కామెంట్‌లు