రాజబాబు నా కోసం రాసిన నాటకం ఎవరు బాధ్యులు. ఇది ఉషశ్రీ గారికి చాలా బాగా నచ్చింది రాజబాబు ఇది ఒక డాక్యుమెంటరీగా తీస్తే బావుంటుందని నా ఉద్దేశ్యం. వీడియో లోకల్ లో ప్రభుత్వపరంగా వారు చేసే ప్రచారం ఎక్కువగా ఉంటుంది ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమా ఫక్కీలో దానిని తయారు చేసి మద్రాసు వెళ్ళి నాకు సన్నిహితుడైన దాసరి నారాయణ రావు గారిని కలిసి మొత్తం వినిపించి మేము సినిమా లాగా దీన్ని తీయాలనుకుంటున్నాం. ఆ సాంకేతికత మాకు తెలియదు మీ కుర్రవాళ్లలో ఒకరిని పంపిస్తే ఆ పని చేస్తాం అని చెప్తే చాలా చక్కటి ఆలోచన తప్పకుండా చేయండి మంచి పేరు వస్తుంది హాయ్ చెప్పి తన దగ్గర పనిచేస్తున్న విజయ్ కుమార్ అన్న కుర్రవాడిని పరిచయం చేసి అతనయితే ఓపికగా చేసి పెడతాడు అని మాకు పంపించారు. మేము ఆ కార్యక్రమంలో ఉండగా దాసరి హీరో కృష్ణ గారిని కలిసి ఒరే అబ్బాయ్ రమేష్ తో ఒక సినిమా తీద్దాం చక్కటి కథ రెడీ గా ఉంది అని చెప్పితే ఆయన సరే అన్నారు. దానికి నీడ అని పేరు పెట్టి రమేష్ ని కథానాయకుడిగా చేసి నారాయణ మూర్తికి కూడా వేషం ఇచ్చి సినిమాగా తీశారు అయితే ముందే దాసరి చెప్పారు ఆనంద్ జీ నేను ఇది నాదర్శకత్వంలో సినిమాగా నా పద్ధతిలో చేర్పులు మార్పులు చేసి తీస్తాను మీరు రాజబాబు గారు అంగీకరిస్తే ఆ పని మీదే ఉంటాను అని చెప్పారు విషయం ప్రజల్లోకి వెళ్లడం ముఖ్యం అది మీరు అయితే చాలా బాగా చేస్తారు అని చెప్పి అంగీకరించాము. ఆ సినిమా చూసిన తర్వాత రమేష్ బాబుకి, దాసరి కి మంచి పేరు వచ్చింది. అతి తక్కువ ఖర్చుతో తీసిన సినిమాకు పది రెట్లు లాభాలు వచ్చాయి అని ఆయనే చెప్పారు. నేను రాజబాబు విద్యాధరపురం వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ కె వెంకట్ రాజు గారిని పరిచయం చేసుకుని మా నాటకాల గురించి చెపితే నాకేం తెలుసు అండి రేడియోలో ఉన్న మీకు రంగస్థలం మీద ఉన్న రాజబాబు దానికి తగినంత నాటక పరిచయం నా దగ్గర లేదు కదా అంటే అలా కాదు మీ పాండిత్యం కాదు మాకు కావాల్సింది నాటకంలో పాత్రల సహజత్వం తీరు ఎలా ఉంది తీసుకున్న కథ దానిని వ్రాసిన పద్ధతి గురించి మీ అభిప్రాయాలు కావాలి అని అడిగితే ఆయన చాలా ఆనందంగా అంగీకరించారు వారికి చదువు లేదు ఆయుర్వేదంలో నిష్ణాతులైన గురువుగారి శిక్షణలో పనిచేయడం ఆయన గొప్పతనం డాక్టర్ గారు ఏకసంధాగ్రహి ఒకసారి విన్న తర్వాత ఆ విషయాన్ని గురించి గురువుగారు మరొకసారి ప్రస్తావించి మొన్న మీరు చెప్పినప్పుడు అలా చెప్పారు కదా ఇప్పుడు వేరే విధంగా చెబుతున్నారు కారణం ఏమిటి అని అడిగే ధైర్యం పుట్టుకతోనే వచ్చింది అలాంటి వారి సలహా సంప్రదింపులతో అనేక నాటకాలను వ్రాసి విజయవంతంగా ప్రదర్శించాము. రాజబాబు నాటకాల నుంచి ఆదివిష్ణు రాసిన సిద్ధార్థ వరకు అన్ని నాటకాలలోను ఆయన ప్రమేయం ఉంది వారికి ఈ విషయం తెలుసు ఈ విషయం తెలియదు అన్న భేదం లేదు మాకు పాఠం చెప్పిన మా గురువుగారు పాటిబండ శ్రీమన్నారాయణ గారు విద్యార్థి లక్షణాలు చెబుతూ కొత్త పాఠం పాత పాఠం ఒకరకం గానే ఉండాలి అనేవారు. ఆ వయసులో నాకు అర్థం కాలేదు రాజుగారిని చూసిన తర్వాత మా గురువుగారు ఎందుకు అలా చెప్పారో అర్ధం అయింది. గురువు గారు నుంచి ఒక విషయాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన అనేక విషయాలను పరిశీలించి విశ్లేషించడం డాక్టర్ గారికి అలవాటు నా వ్యక్తిగత అనుభవం మా ఇంట్లో పిల్లలకు ఏ రుగ్మత వచ్చినా ఆయన వచ్చి మీ కేం పరవాలేదు ముందు భోజనం చేయండి మీకు ఇష్టం వచ్చింది తినండి దాని గురించి అదయిన అయితే నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చేంత మేధావి అందుకే ఆయన తుది శ్వాస విడిచే వరకూ నేను వారివద్దనే ఉన్నాను. నా జీవితంలో ఎన్నో రకాల విశేషాలను వాల్మీకి మహర్షి ధర్మసూక్ష్మాలను ఉషశ్రీ గారికి అనేక సందర్భాలలో సలహాలు కూడా ఇచ్చిన మేధావి డాక్టర్ కె వెంకట రాజు గారు వారు మాకు భౌతికంగా దూరం కావడం మాకు తీరని లోటు.
రాజబాబు నాటకాలు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి