సనకసనందాదులు-- సి.హెచ్.ప్రతాప్;-సెల్ ; 95508 51075
 సనత్కుమారులు లేదా సనకసనందాదులు బ్రహ్మ మానస పుత్రులు.సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు అన్నవి వీరి పేర్లు. సకల శాస్త్రాలు, వేదాలు, పురాణేతిహాసాలను ఔపాసన పట్టిన దిట్టలుగా, మహామహిమాత్ములైన ఋషులుగా ప్రసిద్ధి పొందారు. ఇటువంటి ఋషులు మనకు చరిత్రలో చాలా అరదుగా కనిపిస్తారు. నిత్యం తపోధ్యానంలో వుంటూ కామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాలతో పాటు భౌతికమైన కోరికలను పూర్తిగా అదుపులో వుంచుకొని మానవాళిగా ఆదర్సంగా నిలిచిన మహాపురుషులుగా వీరు కీర్తించబడ్డారు.. సనకసనందాదులు నిత్యబాల్యాన్ని నిరంతర కౌమారదశను వరంగా పొందారు.ధర్మప్రజాపతి పుత్రులు..సృష్టిని పెంపొందించండి అని బ్రహ్మ వీరిని కోరితే సృష్టి చేయటం ఇష్టం లేక తపస్సుచేస్తూ కాలంగడిపారు.బ్రహ్మ సన అని పలకటంతో వీరు పుట్టారు.
సనకసనందనాదులు బాల్యంలోనే వేదాలను ఔపోసన పట్టేశారు. బ్రహ్మజ్ఞానంలోని లోతులను దాటేశారు. బ్రహ్మచారులై లోకసంచారం చేస్తూ, తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారట. నిష్మల్మషమైన మనసు కలిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడూ బాల్యావస్థని దాటి ఎరుగవు. కానీ వృద్ధులైనవారికి సైతం ఆధ్మాత్మిక రహస్యాలను అందించగల జ్ఞానవృద్ధులు. నారదుడు, మార్కండేయుడు వంటి మహారుషులు సైతం వీరి నుంచి బోధను గ్రహించినవారే. ‘అజ్ఞానానికి అహంకారమే మూలం’ అంటూ పృధు చక్రవర్తికి బోధించినా, ‘ఆత్మ ఒక్కటే సత్యం’ అంటూ దృతరాష్ట్రుని మనసుని తేటపరచినా... అది సనకసనందనాదులకే చెల్లింది.
ఒకనాడు విష్ణు దర్శనార్ధం విచ్చేసిన సనత్కుమారులకను అడ్డగించిన జయవిజయులు శాపానికి గురైనారు. తత్ఫలితంగా మూడు జన్మలు విష్ణువుకు విరోధులుగా భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. వీరే భాగవతంలోని హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రామాయణంలోని రావణుడు, కుంభకర్ణుడు ,మహాభారతంలోనిశిశుపాలుడు, దంతవక్తృడు

సి హెచ్ ప్రతాప్ 



కామెంట్‌లు