జ్ఞాన వాణి; వెంకట రమణారావు ; సెల్ ; 9866186864
విద్యల రాణీ 
వీణా పాణీ
జ్ఞాన వాణీ
వందన మమ్మా

మనిషిగా బ్రతికే
మానవత్వం తెలిపే
సౌశీల్యం నింపే
సమభావం నింపే
చదువు నీయవే తల్లీ

మనుషులు రాక్షసు లై 
మారణ హోమం చేసే
మర యంత్రాలుగా
మార్చే చదువులు వద్దమ్మా

ప్రకృతి మాత ఒడిలో పెరిగీ
పర్యావరణం పరి రక్షించే
చదువుల నీయ వమ్మా
మమ్ములను మనుషులను 
చేయవమ్మా

 ఓ సరస్వతి
వివేక దాయినీ
జ్ఞాన వాణీ నీకు
అభివందనం.





కామెంట్‌లు