👌అంబకు నివేదనము
"పులిహోర" ప్రసాదము!
భక్తులకు ప్రమోదము!
ఆత్మ బంధువులార!
( ఆత్మబంధు పదాలు., శంకరప్రియ.,)
👌"హరిద్రాన్నము" అంటే.. సహజ సిద్ధమైన, రోగనిరోధక శక్తినొసఁగు; పసుపు కలిగి యున్న, దివ్యాన్నమే.. "పులిహోర"! దీనినే టైగర్ రైస్ అని, పిలుస్తారు! ఆంధ్రులు గర్వించే వంటకమే "పులి హోర"! అది.. రెండు రకాలు! ఒకటి నిమ్మరసం పులిహోర! రెండవది.. చింతపండురసం పులిహోర!
👌నిమ్మరసం పులిహోర... ఆ పలచని పసుపు కాంతి నీరెండలా మెరుస్తూ; "లేత యవ్వన కన్య" లా ఉంటుంది! అట్లే, చింతపండు రసం పులిహోర.. ఇంత పసుపు పట్టించి స్నానం చేసి, గుప్త గాంభీర్యాన్ని పోగేసుకున్న "పూర్ణ ముత్తయిదువు"లా ఉంటుంది.
👌పులిహోరలో... పోపుపెట్టె లోని దినుసులైన.. ఆవాలు, ఇంగువ, వేరుశెనగ గుళ్ళు, (పల్లీలు) జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి..మున్నగు వాటిని చేర్చి; నూనె లేదా నేతిలో వేయించు తారు! తరువాత, కరివేపాకును వేసి; మూకుడులో వేయించిన వాటిని, హరిద్రాన్నములో కలుపుతారు! అదియే.. "పులిహోర" ప్రసాదము!
👌పులి హోరను ..ఇష్ట దైవమైన అమ్మవారికి, స్వామివారికి.. నివేదన చేస్తాము! తరువాత, ప్రసాదంగా స్వీకరించి నప్పుడు; ఒక పంటికింద చింతపండు లో ఊరిన పచ్చిమిర్చి; మరో పంటికింద వేరుశెనగ గుళ్ళు నములుతుంటే; ఆ రుచి చెప్పనలవి కాదు! అదొక చక్కని అనుభూతి!
⚜️సీస పద్యము⚜️
హరితవర్ణపు కాంతు లానంద మొనగూర్చు,
"పులిహోర" మనపాలి పూర్ణశక్తి
దేవాలయమ్ముల దేదీప్య మానమై
వరప్రసాదమ్ముగా, కరవుదీర్చు
పండుగల్ పబ్బాలు, నిండుగా వెలుగొందు
"పులిహోర" ఘుమఘుమల్ పుష్టి తుష్టి
రవ్వతో పులిహోర రవ్వంత రుచినిచ్చు
నిమ్మకాయను చేర్చ నెమ్మదించు
🚩ఆ.వె.
చింతపులుపు కలియ, చిగురించు కోర్కెలే
తిరగమాత కూడి సిరులమూట
కవన మల్లగాను, కావలె "పులిహోర"
అమ్మ చేతివంట, కమ్మదనము!
("తిరగమాత" అంటే.. పోపు వేయడం)
( రచన: డా. గాయత్రీ దేవి., )
🚩ఓం శ్రీమాత! జయ శ్రీమాత! జయ జయ శ్రీమాత!
(శ్రీమాత షోడశాక్షరి(16)నామ మాలిక., )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి