మహాకాళీ జనని🔱"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 🙏కాల రూపిణి వీవె!
కాళేశ్వరివి నీవె!
     మహాకాళీ జనని
శ్రీదుర్గా భవాని!
         ( శ్రీదుర్గా భవానీ పదాలు., శంకర ప్రియ.,)
👌శ్రీ లలితా సహస్ర రహస్య నామ స్తోత్రము నందు "మహేశ్వరీ! మహాకాళీ!" అని;
 గురుదేవుడైన, "హయగ్రీవ స్వామి"వారు.. శ్రీమాతను ప్రస్తుతిoచారు!
👌మహా కాళీమాత.. మహా కాళేశ్వరుడు, మహా దేవుడైన శివుని దేవేరి! మహత్తర మైనదీ కాళికా మాతృదేవత! మిక్కిలి నలుపు (నీలం) వన్నె కలది! కనుక, శ్రీమాత "మహాకాళి" యైనద దుర్మార్గులను, దానవులను దండించి; విశ్వశాంతిని కలిగించునది.. శ్రీమన్మహా కాళీదేవి!
👌"కాల" శబ్దమునకు "ప్రేరేపించునది" అని, అర్ధము! దీనికి..  సమయము (అనగా, లెక్కపెట్ట లేనిది,) యమధర్మరాజు (అనగా, ధర్మ పరిపాలన కావించువాడు.,).. నానార్ధములు! "కాళి" అనే పదం.. నలుపును సూచించు చున్నది! ఆ నలుపు అంటే.. చీకటి స్వరూపము! అదియే శ్రీకృష్ణ తత్త్వము!
👌దశ మహావిద్యల్లో తొలి దేవత.. మహా కాళి! తొలి విద్య.. మహా కాళి! ఇక్కడి నుంచి వేవెలుగులు ప్రారంభమవు చున్నాయి! ఈ ప్రపంచసృష్టిలోని అనంతమైన దంతా..  నీలము, లేదా నలుపు వన్నెగా గోచరిస్తుంది! అదియే.. ఆకాశము,.. సముద్రము, నక్షత్ర మండలము.. బ్లాక్‌ హోల్‌.. మున్నగునవి! ఫిజిక్స్‌కు సంబంధించి.. అల్టిమేట్‌ ఎనర్జీని "డార్క్‌ ఎనర్జీ" గా పేర్కొంటారు, ఈనాటి విజ్ఞానశాస్త్ర పరిశోధకులు (అనగా, సైన్టిస్టులు)! కనుక, అనంత విభూతులతో విరాజిల్లుచున్న, కృష్ణవర్ణ స్వరూపిణి, మహాకాళీ జనని!
  👌శ్రీదుర్గాసప్తశతి  స్తోత్రంలో.. "కాళ రాత్రి, మహా రాత్రి, మోహ రాత్రి.. మున్నగునవి;  మహాకాళీదేవి స్వరూపములుగా అభివర్ణించారు,మన మహర్షులు!
       "ఓం మహా కాల్యై  నమః!"... శ్రీ లలితా సహస్ర రహస్య స్తోత్రములో "751వ. నామము"!
      🚩కందపద్యము 
🙏కాలము నీవమ్మ! "మహా
    కాలీ"! బ్రహ్మమును నీవె! కరుణామయి! న
      న్నేలెడి తల్లివి నీవే!
      యేల కనన్రావు, శాంభవీ! కృపఁ గనుమా!
  
      ( శ్రీలలితా సహస్ర రహస్య నామ పద్య రత్నావళి, రచన: శ్రీ చింతా రామకృష్ణా/రావు.,)
🙏జయ జయ మహాకాళి!

కామెంట్‌లు