🙏మహిషు డొక రాక్షసుడు!
బ్రహ్మవర ప్రసాది!
అతడొక దున్నపోతు!!
ఓ తెలుగు బాల!!
👌బ్రహ్మ ద్వేషి అతడు!
వివేక శూన్యు డతడు!
అతడు మహిషాసురుడు!
ఓ తెలుగు బాల!
(తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌మహిషాసురుడు.. దానవ చక్రవర్తి!మహిష - రాక్షస సంజాతుడు! రంభాసురుని కుమారుడు! అతడు..
సృష్టికర్త యైన బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసాడు! దేవతలు నుండి, మానవుల నుండి.. తనకు మరణము లేకుండా; వరములను పొందాడు!
👌బ్రహ్మ దేవుడిచ్చిన వరబల గర్వంతో; "ఈ ప్రపంచములో.. తనతో సమానమైన వాడు లేడని", గర్వంతో విర్రవీగాడు! దానితో.. అతని కళ్ళు నెత్తి కెక్కాయి! దురభిమానం పెంచు కున్నాడు! మిక్కిలి స్వార్ధముతో; దురాశా పరుడైనాడు!
👌అతని పేరు మహిషాసురుడు! యుక్తాయుక్త వివేక జ్ఞానమును కోల్పోయాడు! పరమ మూర్ఖాగ్రేసరుడు!
🚩ఉత్పలమాల🚩
⚜️వాఁడొక దున్న పోతు! బలవంతుఁడు! బ్రహ్మ వరప్రసాది! "యీ
రేడు జగమ్ము లందు సరియెవ్వరు నా”కని విఱ్ఱవీగు చు
న్నాఁడు; ప్రపంచ వంచన మొనర్చి త్రివిష్టప మాక్రమించు కొ
న్నాఁడు; వివేక శూన్యుఁడు వినం డెవరెట్టి హితమ్ము చెప్పినన్. (1)
⚜️వాఁ డొక దుండగీఁడు; మెడ వంగని మొండి శిఖండి; స్నేహముం
బూడిద పాలొనర్చెడి ప్రబుద్ధుఁడు; స్వార్థ పరుండు; పెంచు కొ
న్నాఁడు దురాశ; నందన వనంబును బీడొనరించి స్వర్గమున్
పాడొనరించి నాఁడు, పశుబంధుఁడు దుస్సహ దుర్మ దాంధుఁడున్ ! (2)
🚩తేట గీతి🚩
⚜️పేరు మహిషాసురుఁడు! దగాకోరు! మ్రుచ్చు
దనమునకు, మూర్ఖతకును "పెట్టినది పేరు"!!
వాఁడు బాధింప నట్టి దేవతలు లేరు;
వాఁడు పరిభవింపని మునీశ్వరులు లేరు.( 3)
( మధురకవి, డాక్టర్ "కరుణశ్రీ"., "ఉదయశ్రీ," సంపుటము నుండి )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి