తురిమింది;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
అక్క మొక్కలు తెచ్చింది
చక్కగ పాదులు తీసింది
మొక్కలు చక్కగ నాటింది
చిక్కటి కంప చుట్టింది

అక్కా కుక్కను తెచ్చింది
మొక్కకు కాపలా పెట్టింది
కుక్కా నక్కీ చూసింది
చక్కా కాపలా కాసింది

మొక్కలు అన్నీ పెరిగాయి
చక్కగ పూలు విరిశాయి
అక్కా పూలను కోసింది
చక్కగ జడలో తురిమింది!!


కామెంట్‌లు