* మినీలు *- కోరాడ నరసింహా రావు
   @  మనిషి  @
             ***
 అన్నిటినీపరిశీలించి...,పరిశో
ధించి... ఏది ఏమిటో... ఎలాగో 
ఎందుకో తెలుసుకోగలవుతున్న
మనిషి,తననుగురించి తెలుసు
కునే ప్రయత్నం చెయ్యడే.... !
         విజ్ఞానం వెంట పరుగులు తీస్తూ... అజ్ఞానం లో కూరుకు పోతున్నాడే.... !! 
        *******
                * సత్యం *
               *****
   సృష్ఠి రహస్యాల నన్నింటినీ 
తెలుసుకోగలగటం కన్నా... 
   నిన్ను నువ్వు తెలుసుకో.... !
ఇంక ఈ ప్రపంచంలో తెలుసుకో వలసిందేముంటుంది... !?
    నువ్వీ ప్రపంచంలో.....ఉన్నా వన్నది ఎంత సత్యమో, 
   ఈ సమస్త ప్రపంచమూ నీలో నే ఉన్నదన్నది అంతే సత్యం !!
         *****

కామెంట్‌లు