నాకున్న మంచి మిత్రులలో ఒకరు పమిడికాల్వ మధుసూదన్ గారొకరు. ఆయన సారథ్యంలో జెమినీ టీవీ న్యూస్ ఛానెల్లో కొంత కాలం పని చేసాను. ఆ పరిచయభాగ్యం ఇప్పటికీ కొనసాగుతోంది. సుమనస్కులు. ఆయన అప్పుడప్పుడూ నాకు కొన్ని వీడియో క్లిప్పింగ్స్, కొన్ని కథనాలు పంపుతుంటారు. వాటిలో నిన్నొకటి సుభాషితానికి సంబంధించినది. పద్యంతోపాటు ఆయన శైలిలో భావమూ పంపారు. అది విన్నప్పటి నుంచి మనసు నాదగ్గర ఎప్పటి నుంచో మరుగున పడి ఉన్న భర్తృహరి సుభాషితం పుస్తకాన్ని బయటకు తీసి ఇప్పుడే కొన్ని పేజీలు తిరగేశాను. వాటిలో ఒక పద్య భావాన్ని నాకు చేతనైనట్లు ఇచ్చానిక్కడ.....
తెలిసీ తెలియని వాడిని రంజింప చేయటం అసాధ్యం అనడాన్ని భర్తృహరి సుభాషితంలో ఎంత చక్కగా చెప్పారో చూద్దాం...
మొసలి నోట్లో కోరల మధ్య ఉన్న ముత్యాన్నయినా ప్రయత్నించి బయటకు తీయొచ్చు.
పెద్ద పెద్ద అలలతో కూడిన సముద్రాన్నయినా దాటొచ్చు.
కోపంతో బుసకొట్టే పామునయినా
పూదండలా మెడలో వేసుకోవచ్చు.
కానీ
కోపావేశంతో మూర్ఖుడైన వాని మనసుని సమాధానపరచటం అసాధ్యం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి