మాపాప టీనా - నా ముద్దులమనుమరాలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మాపాప నవ్వింది
నాకడుపు నిండింది
మాపాప పిలిచింది
నాకానందం కలిగింది

మాపాప ఎత్తుకోమంది
నామనసు మురిసింది
మాపాప ఆడింది
నన్ను ముచ్చటాపరిచింది

మాపాప కొత్తబట్టలేసింది
నాకు కనువిందుచేసింది
మాపాప చెంతకొచ్చింది
నాపై ముద్దులుకురిపించింది

మాపాప పార్కుకుతీసుకెళ్ళమంది
నాకు బయటకుతీసుకెళ్ళేపనిపెట్టింది
మాపాప పిల్లలతో ఆడుకుంది
నన్ను పరవశములో ముంచింది

మాపాప పలకపట్టుకుంది
నన్ను అక్షరాలునేర్పమంది
మాపాప మిఠాయిలడిగింది
నేనుకొనియిస్తే ఎగిరిగంతులేసింది

మాపాప ఊరికెళ్ళింది
నాకుతాతకావాలని ఏడ్చిమరురోజేవచ్చింది
మాపాపతిరిగొచ్చి నన్నుచూచింది
నాదగ్గరకొచ్చి ఎక్కెక్కి ఏడ్చింది

మాపాప బోసినవ్వులు
నన్ను కట్టిపడవేశాయి
మాపాప ప్రేమాభిమానాలు
నన్ను ముగ్ధున్నిచేశాయి

నాకు అమ్మనాన్నకన్నా
నాతాతే ముద్దన్నది
మాపాప కనబడకపోతే
నాకెందుకో గుబులుపుడుతుంది

మాపాప భవిష్యత్తును
నాకుబంగారుమయం చేయాలనియున్నది
మాపాపను పెద్దపద్దచదువులకు
నాకు పంపాలనియున్నది

మాపాపకు
నేనేమయినాచేస్తా
మాపాపబాగుకు
నేనుకట్టుబడియుంటా


కామెంట్‌లు