సుప్రభాత కవిత ; -బృంద
వేడుకగా వెలుగుల విహారాలు
ప్రశాంత కాసార  దర్పణాలు

వెల్లువైన వెలుతురులో
కలిసిపోయిన చీకట్లు

వెతలన్నీ వెళ్ళగొట్టి
గతులన్నీ మార్చి వేసే
క్షణాలు

మదిలోని రాగవీణమీద
మధుర రాగం వినిపించే
మౌనాలు.

తిరిగిరాని అపురూప క్షణాలు
తరిగిపోని ఆనందాల గనులు

గుండెగదిలో నిక్షిప్తమైన
జ్ఞాపకాల నిధులు...

తలచి తలచి వేడుకగా
మనసు చేసే విహారాలు

కళ్ళలో సయ్యాటలాడే
రాగసుధా తరంగాలు

ఈ ఉషా కిరణాలు
మనసును మీటే
చైతన్య కుసుమాలు

పరిమళం పంచే
మలయ మారుతాలు 

అరుణోదయానికి
అంజలి ఘటిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు