నీ ధైర్యమే నీకు రక్ష;-చంద్ర కళ , విజయవాడ


 నిగ్గదీసి అడుగు
సిగ్గులేని సమాజాన్ని
అక్క, అమ్మ, చెల్లి వున్నా
సంస్కారమెలా మరిచారని 
సభ్యత మరచి విర్రవీగు
మృగాలానే గమనించు 
పిడికిలిబిగించు 
పిడిగుడ్డులు కురిపించు
ఆడమనిషిని చూసి
చోంగకార్చే  వెధవల పనిపట్టు
ద్వంద భాష్యాలు చెప్పే
పెద్దమనుషుల కనిపెట్టు
నీ ప్రతి అడుగున రాళ్ళు, ముళ్ళు
దాటుతు ఆచితూచి అడుగువె య్యి 
నీ వెనుకనే దగాకోరులు దాగారని
తెలుసుకో తెలివిగా మసలుకోచెల్లి
***

కామెంట్‌లు