సునంద భాషితం ; -వురిమళ్ల సునంద, ఖమ్మం
 తాలిశము... తాలిషము
******
తాలిశము,తాలిషము .. ఈ రెండు పదాలను చూసినప్పుడు ఒకేలా అనిపించినా అర్థాలు మాత్రం పూర్తిగా వేరుగా ఉంటాయి. ఇవే  మన తెలుగుకు గొప్ప భాషా నిధులు.
 ఈ పదాలను మన జీవితానికెలా అన్వయించుకోవాలో చూద్దాం.
 తాలిశము అంటే అచలము,అద్రి,కొండ,గిరి,గుట్ట,ఇలాధరము, పర్వతము,ధరాధరము,శైలము,మహీధరము లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
ఎలాంటి  ఒడుదుడుకులకు చలించకుండా మనసెప్పుడూ తాలిశములా ఉండాలి.
 జీవితం అన్నాక కష్టాలు కడగండ్లు కన్నీళ్ళు అతి సహజంగా వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు మనసు నుంచి తొలగించుకోక పోతే శారీరక మానసిక బాధలు పెరుగుతాయి. అందుకే నిబ్బరమైన హృదయంతో  తాలిశంలా ఉండాలి.
 అలా ఆత్మ స్థైర్యంతో  ఉంటూ మనలో ఉన్న ప్రతిభకు సానపెట్టుకోవాలి. తెలివి తేటలను, నైపుణ్యాన్ని మెరుగు పరచుకోవాలి.
అప్పుడే తాలిషముతో సమాజంలో ఇతరులకు స్ఫూర్తి దాయకంగా నిలువగలం.
తాలిషము అంటే ప్రకాశము, తేజస్సు,ద్యోతము, వెలుగు,వర్చస్సు,ప్రతిభాసము... మొదలైన అర్థాలు ఉన్నాయి.
తాలిశములా స్థితప్రజ్ఞతతో ఒడిదుడుకులను అధిగమిద్దాం.
తాలిషముతో  మన ఉనికిని స్ఫూర్తి దాయకం చేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Unknown చెప్పారు…
మేడం మీరు చాలా బాగా విశ్లేషించారు వివిశ్లేషించారు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం