మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారత జాతీయోద్యమంలో ప్రముఖ రాజకీయ, ఆధ్యాత్మిక నాయకుడు. సత్య అహింస విలువలు సార్థకతను
దశాబ్దాల క్రితమే తెలియపరచారు సత్యాగ్రహం, అహింస ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నత ఆశయాలుగా స్వీకరించ బడినాయి. కావుననే ఐక్యరాజ్యసమితి కూడా ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబరు 2 వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా గుర్తించింది.
మహాత్మా గాంధీ గారు నాటి ప్రజల పరిస్థితుల్లో మార్పును ఆశించి సత్యాగ్రహం చేశారు. అందరికీ విద్య, మహిళాసాధకారత, పేదరిక నిర్మూలన, ఖాదీ వస్త్రాల ఉపయోగం వంటి వాటి స్థితిగతుల్లో సామజిక న్యాయం తేవాలని నిరంతరం శ్రమిస్తూ నే వచ్చారు.
సామజిక న్యాయమనే మార్గంలో వచ్చే అనైతిక అడ్డంకులైన ఏడు అంశాలను మహాత్మా గాంధీ గారు 'ఏడు సామాజిక పాపాలు' గా తెలియజేశారు. *ఆ ఏడు పాపాలు ఇలా....
1. నియమ నిష్టలు లేని రాజకీయాలు
2. మానవత లేని శాస్త్ర విజ్ఞానం
3. అంతఃణ లేని ఆనందం
4. త్యాగం లేని పూజ
5. నీతిలేని వాణిజ్యం
6. పని లేని సంపద
7. శీలము లేని విద్య
గాంధీ గారి అనుసారం నైతికత, అర్థశాస్త్రం, రాజకీయం, ఆధ్యాత్మికత వేరు వేరు శాఖలు. కానీ అన్నిటి ఉద్దేశ్యం మాత్రం ఒకటే అదే సర్వోదయం. అయితే ఇవి సత్య అహింసలనే పునాదుల పై నిలిచినపుడే స్వీకార యోగ్యాలుగా ఉంటాయి.
రాజకీయం లక్ష్య రహితమై, ఆదర్శ రహితమైతే అది పవిత్రమైనది కాదనాలి. పొలిటికల్ పవర్ యొక్క లక్ష్యం ప్రజా శ్రేయస్సు. నాయకుడు సత్యాన్వేషణ, నిస్వార్థ, నిజాయితీ నిష్పక్షపాతం గుణాలు కలిగి ఉండాలి. స్వచ్ఛందంగా సాధారణ సగటు మనిషి జీవనం గడపడం తప్పనిసరి కర్తవ్యం.
అలాగే శ్రమలేని సంపాదన ఆమోదయోగ్యం కాదు. ఆశించరాదు. అది దొంగ సొమ్ము అవుతుంది. ఆత్మ సాక్షి లేకుండా ఇతరులను బాధించి, మోసం చేసి పొందే ధన సుఖం పాపం అవుతుంది. అలా పొందే ఆనందం అశాశ్వతం. నిత్యమైన ఆనందం కావాలంటె సగటు అవసరాలు తీరని వారికి సహాయం చేయడం వలన నిజమైన ఆనందం కలుగుతుంది.
మనిషి లక్ష్యం పవిత్రమైనప్పటికీ నీ సరియైన జ్ఞానం లేకపోతే చెడు దారుల్లో నడిచే ప్రమాదమూ ఉన్నది. అది చరిత్రకు మచ్చ తెస్తుంది. మంచి చరిత్ర లేదా మంచి వ్యక్తిత్వం లేనపుడు జ్ఞాని కూడా పాపుల కోవలోకే వస్తాడు.
రామభక్తుడైన గాంధీ ప్రతి మనిషిలో రాముని చూడాలనుకునే వాడు. వ్యాపారం లో అప్పుడప్పుడూ నిజాయితీ చంపబడుతూ ఉంటుంది. అవసరానికి మించి లాభం తీసుకునే వ్యాపారి తన దుకాణం లో మరిచిపోయిన వస్తువును కొన్నవాడికి అప్పజెప్పినా అతడు నీతిమంతుడు అనబడడు. దురాశా పరుడు ఒక దోపిడీ దొంగ లాంటి వాడు.
త్యాగం లేని పూజ కర్మకాండ జరిపించడం లాంటిది.
జీవితంలోని అన్ని విషయాల్లో భక్తి ముఖ్యమని నమ్ముతారు గాంధీ గారు. భక్తి ఆత్మజ్ఞానానికి సాధనం. చిన్న చిన్న స్వార్థాల ఆసక్తుల త్యాగం పరి పూర్ణత్వం వైపూ నడిపిస్తుంది. పరమత సహనమంటే సత్య అహింసలు పాటించడమే. ఇతర మతాల విషయంలో జోక్యం చేసుకోవడం, ఇతర మతాల ను విమర్శించడానికి ఘర్షణ పడటానికి సాకులు వెతకడం అనేది పూజ యెక్క పరమార్థాన్ని ప్రశ్నిస్తుంది.
ఈ విధంగా గాంధీ గారు చెప్పిన ఏడు సామాజిక పాపాలను తెలుసుకొని మసలుకోవడమే జాతిపిత వర్ధంతికి ప్రజలు పాలకులు అర్పించే నిజమైన నివాళి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి