తెలుగోడా
తెలివైనవాడా
తెగువున్నవాడా
తెరువుచూపేవాడా
విజయము నీదిరా
విశ్వము నీదిరా
ముందుకు సాగరా
గమ్యము చేరరా ||విజ||
కంప్యూటరు రంగాన్ని
కదముత్రొక్కించరా
శాస్త్రీయ రంగాన్ని
శాసించిపాలించరా ||విజ||
ప్రతిభను పొందరా
ప్రావీణ్యము చూపరా
పేరు సంపాదించరా
ప్రఖ్యాతి నిలుపుకోరా ||విజ||
విదేశమయినా
స్వదేశమయినా
సాఫ్టువేరయినా
హార్డువేరయినా ||విజ||
చదువులలోనయినా
శోధనలలోనయినా
ఉత్పత్తిరంగములోనయినా
సేవలరంగములోనయినా ||విజ||
నింగిలోనయినా
నేలపైనయినా
నిశీధిలోనయినా
పట్టపగలయినా ||విజ||
వ్యవసాయములోనయినా
వ్యాపారములోనయినా
వృత్తిలోనయినా
ప్రవృత్తిలోనయినా ||విజ||
తెగువనీదిరా
తెలివినీదిరా
తెలుగుదనము నీదిరా
తియ్యదనము నీదిరా ||విజ||
శ్రద్ధచూపువాడా
శ్రమపడెడువాడా
సలక్షణమయినవాడా
సురక్షితమయినవాడా ||విజ||
తనవారికయినా
పరాయివారికయినా
సలహాలిచ్చువాడా
సహకరించువాడా ||విజ||
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి