పూలు రోదిస్తున్నాయి
మానవులు అవమానిస్తున్నారని
పూలు రోదిస్తున్నాయి
అధమాధముల
పాదాల క్రింద పరుస్తున్నారని
పూలు రోదిస్తున్నాయి
దుర్మార్గుల కంఠసీమలకు
అలంకారం కావలసి వస్తోందని
పూలు రోదిస్తున్నాయి
అరక్షణం తమ అందాన్ని
ఆస్వాదించని వారి చేతికి
పుష్పగుఛ్ఛంగా ఇవ్వబడుతున్నానని
పూలు రోదిస్తున్నాయి
రెక్కలూడబెరికి తమను సమాధులకు అలంకరణగా
వుపయోగిస్తున్నారని
పూలు రోదిస్తున్నాయి
కుళ్ళిన శవాలపై
అలంకరించి
తమను అవమాన పరుస్తున్నారని
పూలు ఆశపడుతున్నాయి
దేశమాత సేవకై తనువులర్పించిన
వీరుల హృదయిలపై ఒక్కక్షణం
సగర్వంగా నిలవాలని
పూలు ప్రార్థిస్తున్నాయి
భగవంతుని పాదాలపై
తమజీవితాలు కడదేరిపోవాలని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి