హేమము...హేయము
******
ఒక్క అక్షరం మార్పుతో అర్థమే మారిపోయే పదాలను చూసినప్పుడు ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి. తెలుగు భాషలోని గొప్పతనానికి నమోనమః అనకుండా ఉండలేం.
హేమములా ఉండాలని, బతకాలని, పెద్దవాళ్ళు ప్రేమగా సంతానాన్ని దీవిస్తారు.కానీ తినీ, తినకుండా లోభత్వంతో హేమాన్ని కూడబెట్టాలని కోరుకోరు.
హేమము చాలా ఖరీదైన లోహము.
హేమము అంటే బంగారం కనకము,కాంచనము, పసిడి, సువర్ణము ఇలా చాలా అర్థాలున్నాయి.
ఈ బంగారాన్ని మంచి మనసుకు,మంచితనానికి అన్వయిస్తుంటారు.అణకువ, విజ్ఞత,వివేకంతో మసిలే పిల్లలను... బంగారం లాంటి అమ్మాయి/ అబ్బాయి అనో, ఫలానా వ్యక్తి మనసు బంగారం లాంటిదనో అనుకోవడం తరచుగా వింటుంటాం.
ఈ భువిపై హేయముగా బ్రతకకుండా,హేమములా జీవించాలి.
హేయము అంటే నీచము,తుచ్ఛము, అసహ్యకరము,రోత మొదలైన అర్థాలు ఉన్నాయి.
హేయమైన పనులకు ఎల్లప్పుడూ దూరంగా ఉంటూ హేమములా నలుగురిలో ప్రత్యేకతను చాటుకుంటూ జీవనం సాగించాలి.
అప్పుడే వ్యక్తిత్వం ఉన్నత విలువలతో హేమాద్రిలా సమాజంలో ప్రకాశిస్తూ ఉంటుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి