సుప్రభాత కవిత ; -బృంద
కనుచూపు మేర చీకటిని
కిరణాలతో తరిమేసి

విజయాల వనాలను
చేరువ చేసి

దారిలో ముళ్ళని
దాటుకునే ఆలోచన నిచ్చి

చెడు మీది  గెలిచి తీరు
మంచితనాన్ని నిలిపి..

మనసులలో  మానవత్వం
మేలుకొలిపే  వరమిచ్చి

అసత్యాలు  అక్రమాలు
అత్యవసరంగా రూపుమాపి

ప్రశాంతతనిచ్చి పరిపాలించి
చల్లగ చూడవమ్మా పరమేశ్వరి

నీ ఉనికి వుందని  వుంటుందని
నమ్మకాన్ని కలిగించే

పచ్చని పర్వదినానికి స్వాగతమిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు