చిలుకను
పడతా
పంజరంలో
పెడతా
చిట్టిచిలుకను
పెంచుతా
స్నేహం
చేస్తా
గింజలు
అందిస్తా
గారాభం
చేస్తా
పంచదార
పెడతా
మాటలు
నేర్పుతా
నీటిని
త్రాగిస్తా
నాట్యం
చేయిస్తా
తోటకు
తీసుకెళ్తా
తోడుగా
నిలబడతా
ఆటలు
ఆడిస్తా
కేరింతలు
కొట్టిస్తా
బంతిని
విసురుతా
ముక్కుతో
తోయిస్తా
తలను
నిమురుతా
తోకను
తట్టుతా
చేతిలోకి
తీసుకుంటా
చిందులు
త్రొక్కిస్తా
బంధీగా
ఉంచుతా
బంధం
కొనసాగిస్తా
నాచిట్టి
చిలకమ్మా
నాతోనే
ఉండిపోవమ్మా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి