సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఆశ...ఈశ
******
మనిషికి ఆశ,ఈశ రెండూ ఉండాలి.
ఆశ మనిషిని బతికించే ఊపిరి అయితే ఈశ అనేది ఆ మనిషి ఏ స్థాయిలో, ఎలా బతుకుతున్నాడో తెలిపే స్థితి.
ఈశ కోసం ఆశపడుతూ వ్యక్తులు ఎన్నో పనులు చేస్తుంటారు.
ఆశ అంటే ఏమిటో అర్థమై వుంటుంది. కోరిక,వాంఛ, ఆకాంక్ష,ఇచ్ఛ ఇలా అనేక పర్యాయ పదాలతో పాటు,దిక్కు,దిశ, ఆశ్రయం అనే నానార్థాలు కూడా ఉన్నాయి.
పూలకు తావి అబ్బినట్లు ఆశ ఆశయంతో  గుబాళించాలి.
ఆశకు ఈశ తోడైతే ప్రయత్నం సఫలం అవుతుంది.
ఈశ అంటే  ఆస్తి, ఐశ్వర్యము,కలిమి, భాగ్యం, సంపత్తి, సంపద,సిరి, సొమ్ము లాంటి అనేక పర్యాయ పదాలతో పాటు అపర్ణ,అయ్యాయి,ఈశాని పార్వతి,ఈశ్వరి,ఉమ లాంటి అనేక అర్థాలు కూడా ఉన్నాయి.
ఆశల పల్లకిలో ఆనందంగా ఊరేగాలంటే,ఈశ కటాక్షం లభించాలి.
ఆశ ఎల్లప్పుడూ ఆశయంతో వెలగాలి.అప్పుడే ఆశకు సార్థకత చేకూరుతుంది.
ఈశ ఎప్పుడూ వదాన్యతతో మెరవాలి.అప్పుడే వ్యక్తిత్వం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు