సుప్రభాత కవిత ; -బృంద

నింగి కురిపించిన
నీహారికా బిందువులు

మొత్తంగా మొక్కనంతా
ముంచేసిన  మంచు...

పొద్దుపొడుపు వేళ
కిరణాల తాకిడికి

నులివెచ్చని ప్రియభావన
మనసంతా నిండిపోగా

నిలువెల్లా కరిగిపొియి
తన రూపమె మాసిపోగా

మమతలోనె కరుగువేళ
అస్తిత్వమే పోయిననూ

ఆనందమే!!నాకనుచు
తనకు తానే ప్రేమలో

కరిగి నీరై....కనులనిండ
మిత్రుడి రూపు నిండిపోవ

సప్తవర్ణ  రేఖలతో
సంతోషం  తెలియచేస్తూ

కలతలన్ని కరిగిపోతూ
జలజలమని రాలిపోవు

మిలమిల మెరుపులు
కనులలోన  మెరిపించు

కమ్మనైన ఉదయానికి
కంటిచూపే హారతి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు