చిలుకమ్మ-చిట్టి పాప(బాలగేయం);--గద్వాల సోమన్న
చిలుక ఒకటి నింగిలో
ఎగిరి ఎగిరి వచ్చెను
చెట్టు మీద చేరుకొని
అటూ ఇటూ తిరిగెను

జామకాయ చూసెను
దాని నోరు ఊరెను
ముద్దుగా కొరికి కొరికి
తృప్తిగా తిన సాగెను

పాప అచ్చటికొచ్చెను
దోర పండు గాంచెను
ఒక్క పండు ఇవ్వమని
చిలుకమ్మను అడిగెను

చిలుక పొంగి పోయెను
పండు ఒకటి ఇచ్చెను
పాప మురిసి పోయెను
కృతజ్ఞతలూ తెలిపెను

చిలుక వెడలి పోయెను
పాప ఇంటికెళ్లిను
జామ పండు చూసి చూసి
మురిసి మురిసి పోయెను


కామెంట్‌లు