నువ్వు నాతో మాట్లాడటం మానేస్తే
ఆ నిశ్శబ్దాన్ని మౌనంగా గుండెలో నింపుకొని
సహన నిశ్చలంగా మారిపోతాను !
చీకటిని అంతమొందించి వేకువ తెచ్చే
ఉదయకిరణాలకై నిరీక్షిస్తాను !
నా మనోకాశ వీధిలో నీ పదాల గువ్వలు
రెక్కలు విప్పుతాయని ఆశిస్తాను !
ఏదో నాడు నా విపిన వీధిలో
నీ స్వర సుమాలు వికసిస్తాయని చూస్తుంటాను !
నీ నిష్క్రమణ తాలూకు నీలినీడలు
మచ్చుకైనా కానరానీయక నువ్వే చిరునవ్వుగా ...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి