జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల -వావిలాలలో పనిచేస్తున్న డాక్టర్ అడిగొప్పుల సదయ్య గణితోపాధ్యాయునిగా మాత్రమేకాక వివిధ రంగాలలో తనదైన ముద్రవేసి రాణిస్తున్నారు.వీరు కరీంనగర్ జిల్లా,వీణవంక మండలం,రెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు.తల్లి కౌసల్య.తండ్రి రామయ్య.ధర్మపత్ని సరస్వతి.కుమారులు అర్చిష్మాన్ ,మహతీ నందన్.వీరు ఉపాధ్యాయసంఘ నాయకునిగా,కవిగా,మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, స్కౌట్ మాస్టర్ గా,భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కరీంనగర్ జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా సేవలందిస్తున్నారు.
ఉపాధ్యాయుడుగా:
2001 డియస్సీలో 12 వి ర్యాంకు సాధించి,18-01-2002న ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించిన సదయ్యగారు మొదటగా పూర్వ జమ్మికుంట మండలం ప్రాథమికోన్నత పాఠశాల-పాతర్లపల్లిలో సుమారు ఎనిమిది సంవత్సరాలు పనిచేసి విద్యార్థులకు అనేక బోధనోపకరణాలను ఉపయోగిస్తూ విద్యాబోధన చేసి వారి అభిమానాన్ని చూరగొన్నారు.ఆ తరువాత బదిలీలో వీణవంక మండలం ప్రాథమికోన్నత పాఠశాల-వల్భాపూర్ లో సుమారు మూడు సంవత్సరాలు పనిచేశారు.ఈకాలంలో జిల్లా రిసోర్స్ పర్సన్ గా "స్నేహబాల" బోధనోపకరణాల రూపకల్పనలో పాల్గొన్నారు.ఉపాధ్యాయుల శిక్షణా మాడ్యుల్ రచయితగా సేవలందించారు.ఆ తరువాత 27-01-2012 న గణితోపాధ్యాయునిగా పదోన్నతి పొంది జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల -వావిలాలలో చేరి,ఇంకా అక్కడే పనిచేస్తున్నారు.ఈ పాఠశాలలో 25-02-2013 న "నేతాజీ స్కౌట్ ట్రూప్ " ఏర్పాటు చేసి ఎన్నో సామాజికోపయోగ,అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఉపాధ్యాయవృత్తిలో అందుకున్న గౌరవ పురస్కారాలు:
1.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ - బహుజన ఉపాధ్యాయ సంఘం, కరీంనగర్ జిల్లాశాఖ
2.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ - జిల్లా విద్యాశాఖాధి కార్యాలయం, కరీంనగర్
3.జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ - లీడ్ ఇండియా
స్కౌట్ మాస్టర్ గా:-
2007 లో బేసిక్ స్కౌట్ మాస్టర్ గా శిక్షణ పొందిన వీరు 2013 లో అడ్వాన్స్ శిక్షణ,2019 లో "హిమాలయ వుడ్ బ్యాడ్జ్ శిక్షణ",2020లో "ప్రి- అసిస్టెంట్ లీడర్ ట్రైనర్ శిక్షణ" పొంది,ప్రస్తుతం స్కౌట్ విభాగంలో కరీంనగర్ జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ గా పనిచేస్తున్నారు.ఇప్పటి వరకు పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి శిబిరంలో పాల్గొన్నారు; తొమ్మిది మంది విద్యార్థులు దక్షిణ భారతదేశ స్థాయి శిబిరంలో పాల్గొన్నారు.10 మంది స్కౌట్ లు రాష్ట్ర గవర్నర్ గారి నుండి "రాజ్యపురస్కార్ అవార్డులు" అందుకున్నారు.ఇద్దరు స్కౌట్లు "గవర్నర్ రిపబ్లిక్ పెరేడ్ -హైదరాబాద్ "కి ఎంపికయ్యారు. స్కౌటింగ్ ఉద్యమంలో వీరి కృషిని గుర్తించి "ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీప్ నేషనల్ కమీషనర్" శ్రీ కె కె ఖండేల్ వాల్ గారు సదయ్యను 22-02-2021 న ఢిల్లీకి ఆహ్వానించి బ్రాంజ్ పిన్ అందజేసి "ఫ్రెండ్ ఆఫ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవార్డు"తో సత్కరించారు.స్కౌటింగ్ ఉద్యమంలో చేసిన కార్యక్రమాలు:
1.స్వచ్ఛ్ భారత్ - పాఠశాల ఆవరణలో పరిశుభ్రత నిర్వహణ
2.హరితహారం - పాఠశాల ప్రాంగణంలో 100 మొక్కల పెంపకం.
3.ప్రతి సంవత్సరం వినాయక చవితికి "మట్టి విగ్రహాల వాడకం" పై గ్రామంలో అవగాహనా ర్యాలీ -మట్టి విగ్రహాల వితరణ.
4.ప్రతి సంవత్సరం గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహనా ర్యాలీ.
5.సమ్మక్క- సారక్క జాతర-వావిలాలలో సేవా శిబిరం.
6.శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు-ఇల్లందకుంట,భద్రాచలంలో సేవా శిబిరం.
7.శివరాత్రి జాతర -కాళేశ్వరంలో సేవా శిబిరం.
8.గోదావరీ మహా పుష్కరాలు-2016లో 12 రోజుల సేవా శిబిరం, కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ గారిచేత ప్రశంసాపత్రాల స్వీకరణ.
పాల్గొన్న శిబిరాలు:
1.శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2007
2.శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సేవాశిబిరం-2010
3.స్వచ్ఛ్ భారత్ - సుందర్ భారత్ వర్క్ షాప్ ,చెన్నై
4.నేషనల్ జంబోరీ-2016-17,మైసూర్
5.సర్వ ధర్మ ప్రార్థన, ఇంటర్నేషనల్ థింకింగ్ డే -2021,నేషనల్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ
6.జాతీయ స్థాయి కోవిడ్-19 అవేర్ నెస్ క్యాంపు,శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం,కాట్రా,జమ్ము-కాశ్మీర్
జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ (స్కౌట్) గా:-
అడిగొప్పుల సదయ్య గారు 2021 సెప్టెంబర్ నుండి "భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కరీంనగర్ జిల్లా అసోసియేషన్"లో జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ (స్కౌట్)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సెన్సస్ పెంచడానికి కృషి చేస్తున్నారు.గత రెండు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు సుమారు 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ ని తృతీయసోపాన్ మరియు రాజ్యపురస్కార్ టెస్టింగ్ క్యాంపులకు పంపడం జరిగింది.జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తూ,రాష్ట్ర అసోసియేషన్ నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.కరోనా లాక్ డౌన్ కాలంలో సుమారు 1000 మాస్కులను పంపిణీ చేయడం,పి.ఎమ్ .కేర్ అండ్ షేర్ కి సుమారు 20,000-00 వితరణ మరియు 30 మంది పేద విద్యార్థులకు నిత్యావసర వస్తువుల వితరణ చేయడం జరిగింది.
కవిగా:-
అడిగొప్పుల సదయ్య ఈతరం పద్యకవులలో ఒకరుగా చక్కని గుర్తింపు పొందారు."ఇష్టపది" అనే నూతన పద్య ప్రక్రియను రూపొందించి,ఆ ప్రక్రియలో ఇప్పటి వరకు వంద కవులచేత సుమారు పది వేల "ఇష్టపదులు" రాయించారు.ఆ ప్రక్రియలో ఇప్పటి వరకు నాలుగు కవితా సంకలనాలు మరియు "తిరుప్పావై" అనే ముప్పై తమిళ పాశురాలను ఇష్టపది ప్రక్రియలో ముద్రించారు.అందుకు కవిత్వంలో "గౌరవ డాక్టరేట్" ను "ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ "నుండి అందుకున్నారు.కవిగా సదయ్య గారు ఇప్పటి వరకు శ్రీ శ్రీనివాస శతకం (కందం),మనుచరిత్ర-ప్రథమ, ద్వితీయ ఆశ్వాసాలు(ముత్యాల సరాలు),పురుషోత్తమ మాల(ఇష్టపదులు),ముకుందమాల (ఇష్టపదులు), బాలసాహిత్యం,వచన కవిత్వం మొదలైనవి రాశారు.కవిగా వివిధ సాహితీ సంస్థల నుండి సన్మానాలు, పురస్కారాలు మరియు బిరుదులు పొందారు.
1.సహస్ర కవి మిత్ర బిరుదు -తెలుగు కవితా వైభవం సంస్థ, హైదరాబాద్
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర బిరుదు -తెలుగు కవితా వైభవం సంస్థ, హైదరాబాద్
3.కవనశ్రీ చక్రవర్తి & కవి చక్ర బిరుదులు - శ్రీ మల్లినాథ సూరి కళాపీఠం,ఏడుపాయల సంస్థాన్
4.కాళోజీ పురస్కారం - తెలుగు భారతి సంస్థ,విజయనగరం
5.కవి రత్న బిరుదు - తెలుగు వెలుగు సాహిత్య వేదిక, హైదరాబాద్
6.కళాసాగర పురస్కారం - గోదావరి రచయితల సంఘం,రాజమండ్రి
7.డా.బి,ఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం -దళిత సాహిత్య అకాడెమీ,న్యూఢిల్లీ
8.సాహితీ భూషణ బిరుదు - మునియేటి రచయితల సంఘం,పెనుగంచిప్రోలు
9.సాహితీ చక్రవర్తి బిరుదు - మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం
10.విద్యా జ్యోతి రత్న బిరుదు -కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్ మొదలైనవి.
వీరి కవితలు సుమారు 30 కవితా సంకలనాలో ప్రచురింపబడినవి.ప్రస్తుతం "తపస్వీ మనోహరం అంతర్జాల వారి పత్రికలో సర్వం విష్ణుమయం అనే శీర్షిక నిర్వహిస్తున్నారు.వీరి కవితలు ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,తెలంగాణా కేక,ప్రవాహిణి,మొలక,మనోహరం,ఆదాబ్ హైదరాబాద్,తెలుగు సొగసు,నేటి నిజం,నవ తెలంగాణా,ఉదయం,అల,సహరి,విజయానికి వైభవం,నమస్తే తెలంగాణా మొదలైన పత్రికలలో ప్రచురింపబడినవి.
మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా:-
డాక్టర్ అడిగొప్పుల సదయ్య గారు 2020 సంవత్సరం "కరోనా లాక్ డౌన్ " కాలంలో "మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం"అనే సంస్థను స్థాపించడం జరిగింది.ఈ సంస్థ కవి సమ్మేళనాలు నిర్వహించడం,కవితా సంకలనాలు ముద్రించడం,కవులను ప్రశంసాపత్రాలు,బిరుదు ప్రదాన పత్రాలు,ప్రోత్సాహక బహుమతులు (క్యాష్ ప్రైజ్) ఇచ్చి ప్రోత్సహించడం,ఇష్టపది ప్రక్రియకు విస్తృత ప్రాచుర్యత కల్పించడం,మొదలైన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది.ఈ సంస్థ "వాట్సప్ గ్రూప్","ఫేస్ బుక్ గ్రూప్","సాహితీ బ్లాగ్" ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తోంది."ప్రతిరోజూ కవితా పండుగే" అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ ఒక అంశమును ఇచ్చి,వివిధ ప్రక్రియల్లో కవితలు రాయిస్తూ,కవులకు ప్రశంసాపత్రాలు ఏరోజుకారోజు అందిస్తోంది.ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు:
1.కరోనా ఇష్టపది కవితా సంకలనం - జూమ్ కవి సమ్మేళనం
2.నమో దాశరథి కృష్ణమాచార్య ఈ-కవితాసంకలనం
3.మనసు దోసినారె (డా.సినారె) ఈ-కవితాసంకలనం
4.స్వతంత్ర భారతం ఈ-కవితాసంకలనం
5.మాతృదేవో భవ ఈ-కవితాసంకలనం
6.గురుభ్యోనమః ఈ-కవితా సంకలనం
7.గణితం మూర్థ నిస్థితయే ఈ-కవితాసంకలనం
8.పర్యావరణం-పరిరక్షణ ఈ- కవితా సంకలనం
9.గాంధీ జయంతి కవితా సంకలనం
10.బాల భారతం కవితా సంకలనం
11.ప్రకృతి పర్వం(బతుకమ్మ కవితలు) కవితా సంకలనం
12.శ్రీమద్రామాయణం ఈ-కవితాసంకలనం
13.కార్మిక దినం ఈ-కవితాసంకలనం
14.ఇష్టపది కవితా సంకలనం -1
15.ఇష్టపది కవితా సంకలనం -2
16.తిరుప్పావై ఇష్టపదులు
17.గజాననాయ నమో ఈ-కవితాసంకలనం
18.వజ్రభారతి ఈ-ఠవితాసంకలనం
19.సుమారు 10000 ప్రశంసాపత్రాల పంపిణి
20.50 మందికి "మహతీ సాహితీ చక్రవర్తి" బిరుదు ప్రదానం.
21.100 మందికి "మహతీ సాహితీ వల్లభ" బిరుదు ప్రదానం
22.59 మందికి "ఇష్టపది మిత్ర,ఇష్టపది శ్రేష్ఠ,ఇష్టపది స్రష్ఠ,ఇష్టపది వశిష్ఠ,ఇష్టపది చక్రవర్తి" బిరుదుల ప్రదానం.
ఉపాధ్యాయ సంఘ బాధ్యునిగా:-
అడిగొప్పుల సదయ్యగారు జూన్ నెల,2022 నుండి తెలంగాణా టీచర్స్ యూనియన్ జమ్మికుంట మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ,జిల్లా శాఖ,రాష్ట్ర శాఖ సహాయ సహకారాలతో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారు.
రిసోర్స్ పర్సన్ గా:-
అడిగొప్పుల సదయ్య 2005 నుండి ఇప్పటి వరకూ వివిధ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.మచ్చుకు:
1.స్నేహ బాల కార్డులు-తెలుగు కీ-రిసోర్స్ పర్సన్ గా
2.క్లిప్ శిక్షణలో తెలుగు ఆర్పీగా
3.క్లాప్ శిక్షణలో గణితం ఆర్పీగా
4.ఎల్ ఈ పి లో గణితం ఆర్పీగా
5.ఎంఆర్పీల శిక్షణా మాడ్యుల్ రచయితగా
6.ఇంగ్లీష్ లెర్నింగ్ ఎన్రిచ్మెంట్ కోర్సు మెంటర్ గా
7.స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు-గణితం ఆర్పీగా
ఈ విధంగా అడిగొప్పుల సదయ్య తన ఉపాధ్యాయవృత్తికి ప్రాధాన్యత ఇస్తూనే,ప్రవృత్తులైన సాహిత్యం మరియు స్కౌటింగ్ రంగాలలో బహుముఖీనంగా రాణిస్తున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి