* లలితగీతం *;- కోరాడ నరసింహారావు

 పల్లవి :-
.స్పందించిన  ఆ   హృదయం 
 రాగాలై  పలుకుతోంది  !
  ఆ జీవి తానుభవం... 
   నవరసాలు ఒలుకుతోంది  !!
      "స్పందించిన ఆ.... "
చరణం :-
  బ్రతుకంటే  మధురమైన 
  పాటలాగే  సాగాలి !
  కష్ట -  సుఖాలు గమకాలై 
  ఉత్సాహం పెరగాలి !!
        "స్పందించే ఆ.... "
చరణం :-
  మనజీవితమొక 
   మంచి పాటలా... 
     కలకాలం నిలవాలి !
     మరిచిపోక అందరిమదిలో 
      గురుతుండిపోవాలి... !!
        " స్పందించిన ఆ.... "
      *******
కామెంట్‌లు