ఖండగతి 5555
రదీఫ్ : ఏలనో
**============
మంచినే చేసినా కనలేరు ఏలనో!
సాయపడు మనిషినే మరచేరు ఏలనో!
పరులకై కొంతయిన పాటుపడి బ్రతకాలి!
స్వార్ధమే చేటన్న విడలేరు ఏలనో!
కులమన్న మతమన్న కలహాలు
వచ్చేను!
మనిషిలా స్వేచ్చగా మనలేరు ఏలనో!
పేదయిన గొప్పయిన కష్టాలు ఒకటేగ!
తెలుసుకో నిజమన్న వినలేరు ఏలనో!
మాలులో ధరయిచ్చిగొప్పగా కొంటారు!
రైతుకడ సరుకులను కొనలేరు ఏలనో!
ప్రేమనే కోరుతూ వెతుకుతూ తిరిగేరు
త్యాగమేగొప్పదని అనలేరు ఏలనో!
యుద్దాలు మనుగడకు ముప్పనీ తెలియునుగ
తగవులే లేకనే ఇలలేరు ఏలనో!
--**-=-
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి