చిత్రకవిత :- ఆనందగమ్యం ;-కోరాడ నరసింహా రావు !
ఎండా వానలనుండి 
     కాపాడే  గొడుగు... !
 వృద్దాప్యంలో చెయ్యిపట్టి
    నడిపించే మనవడి తోడు !! 

ఇదిఅందరికీఅందనిఅదృష్టమే! 
పూర్వకర్మల పుణ్యఫలమే !!

ముసలి తనంలో... 
 ఆసరా దొరకని జీవితం... 
   ఎడారి ప్రయాణమే కదూ !

అందుకే,కోట్లు గడించటం కన్నా 
కాస్తంత పుణ్యాన్ని మూటగట్టు కోవటం మిన్న కదూ... !!
 
మనం చేసుకున్న ధర్మమేగొడుగై  పుణ్యమే...తోడై బ్రతుకును సాఫీగా గమ్యం చేరుస్తాయి !

యవ్వనంఎవరిలక్ష్యమూలేకుం డా గడపగలవేమో గానీ... 
   వృద్దాప్యం నువ్సంపాదించిన 
సంపదలతో గడిచిపోదు... !
      నువ్ చేసిన సత్కర్మలే నీకు 
నీడై, తోడై... నిన్ను సుఖంగా... 
 గమ్యాన్ని చేర్చేవి... !!
. .  ******

కామెంట్‌లు