ఈ రోజు ఉదయం నుంచీ వర్షం కురుస్తూనే ఉంది..ఏంటో ఈ వాన అస్సలు తగ్గేలా లేదు ఇప్పుడు బయటకెలా వెళ్లాలి..అనుకుంటూనే సాయంత్రం వరకూ ఇంట్లోనే ఉండిపోయాను.అమ్మ పొద్దున్నే వేడిచేడిగా మినపదోశలు వేసి ఇచ్చింది..కొబ్బరిపచ్చడి నంజుకుని గబగబా రెండు దోశలు తినేసరికి ఆకలితీరినట్టుంది..ఇంక చాలమ్మా..అన్నాను..అప్పుడే చాలేంటి..ఇంకోదోశ వేశాను..వస్తోంది అదీ తినాల్సిందేనంది అమ్మ..అమ్మ చెప్పాక మారు మాట్లాడకుండా వినాల్సిందే, తినాల్సిందే కదా.లేదంటే అమ్మ మనసు నొచ్చుకుంటుంది కదా.
టిఫిన్లు అయ్యాక నాన్న సోఫాలో కూర్చున్నారు..టీవీలో ఏదో చూస్తుంటే, అదేం చూస్తారులే గానీ కొత్త సినిమా పెడతాను చూడండి నాన్న అన్నాను..టిఫిన్ చేస్తున్నప్పుడే సెల్ ఫోన్ లో సినిమా డౌన్ లోడ్ చేసేశాలే.నిన్న విడుదలైన సినిమా అప్పుడే వచ్చేసిందా అని అడిగారు నాన్న అమాయకంగా..నిన్ననే వచ్చేసింది నాన్న.. నేనే ఇంకా ఆలస్యంగా డౌన్ లోడ్ చేసుకున్నానంటూ టీవీకి ఫోన్ ని కనెక్ట్ చేసి, సినిమా పెట్టాను..మా 'బాస్' సినిమా..'మెగా' ఎంట్రీ అదిరిపోయింది.కానీ సౌండ్ అస్సలు బాలేదు..మాటలేమీ అర్థం కావడం లేదు.అప్పటికిగానీ పైరసీ చూడ్డం ఎంత పొరపాటో నాకు అర్థం కాలేదు.నాన్నా..థియేటర్ లో చూద్దాంలే ఇప్పుడు వద్దు..ఆపేయనా అనగానే..సరే అన్నారు హుందాగా..సినిమా తీసేసి రాత్రి సగం చూసి వదిలేసిన వెబ్ సిరీస్ పెట్టాను..1995లో బ్యాంకు దొంగతనం నేపథ్యంలో సాగే కథ కావడంతో కాస్త ఇంటరెస్టింగ్ నే ఉండటంతో అందరం చివరివరకూ అదే చూస్తూ కూర్చున్నాం.మధ్య మధ్యలో అమ్మ బిస్కెట్లు, యాపిల్ ముక్కలు తినిపిస్తూనే ఉంది.
సాయంత్రానికి వర్షం కాస్త శాంతించింది. సరిగ్గా అప్పడే..ఆఫీసు టైం అయ్యి చాలా సేపయ్యింది..త్వరగా రండి బాబూ..రోజూ ఇలా బొట్టు పెట్టి పిలవాలా..అంటూ మా ఇన్చార్జ్ వాట్సప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు..నేను చూసే సరికే పదినిమిషాలైంది ఆ మెసేజ్ పెట్టి..ఇంక చూడాలి నా టెన్షన్..నేను..నా బండి గాల్లో పరుగెత్తాం..ఐదే నిమిషాల్లో ఆఫీసులో ఉన్నా..అయితే అప్పటికే వెబ్ సిరీస్ చూస్తూ ఇంటిదగ్గరే సగం పని పూర్తి చేసేశాలే.
మళ్లీ వాన మొదలైందని ఎవరో అనే సరికి..పని మధ్యలో బయటకు వచ్చి కాసేపు నిలబడి దానినే చూస్తూ ఉండిపోయాను.. విద్యుత్ దీపం వెలుగులో చెట్లమీదుగా జారుతున్న చినుకులు ఓ వైపు జలపాతాన్ని తలపిస్తున్నాయి..మరోవైపు కొమ్మలకున్న ఆకులపై మంచు ముత్యాల్లా మెరుస్తున్నాయి. వర్ణలకందని ప్రకృతి అందమది..దానిని చూశాక పని ఒత్తిడి మాయమైంది.
కాసేపటికి మళ్లీ వాన తగ్గడంతో ఇంటికి బయలుదేరాను..దారిలో ఐస్ క్రీమ్స్ కొన్నాను..ఓ సినిమాలో హీరో అంటాడుగా ఎండలో ఐస్ క్రీమ్ ఎవడైనా తింటాడు..వానలో తినడమే రొమాంటిక్ అని..కానీ నేను అందుకు కొనలేదు.ఆఫీసుకి వచ్చేముందు గుమ్మం వరకూ ఎదురొచ్చి..డాడీ..త్వరగా వచ్చేయ్..ఐస్ క్రీమ్ తీసుకురా డాడీ..అని నా పాప చెప్పింది.కూతురంటే మరో అమ్మేకదా..చెబితే తీసుకురాకుండా ఎలా ఉండగలం.
మా వీధిలోకి వచ్చేసరికే డాడీ అని పిలుపు..తలపైకెత్తి చూస్తే, అమ్మా..పాప రెండవ అంతస్తులో బయట నిలబడి నా కోసం ఎదురుచూస్తున్నారు.లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్లగానే..జాగ్రత్తమ్మా..నీళ్లు ఉన్నాయి కాలు జరుతుందేమో చూసుకో..ఇది చెబుదామనే మేమిద్దరం ఇక్కడ నిలబడ్డాం..అని అమ్మ జాగ్రత్తలు చెబుతుంటే, పాప నా చేతిలో ఉన్న కవర్ లో ఏముందోనని తెగ వెతికేస్తోంది..తెచ్చిన ఐస్ క్రీమ్ చేతికిచ్చినప్పుడు ఆ చిన్ని మొహంలో ఎంత సంబరమో..త్వరత్వరగా కొంచెం తినేశాక..నాకు పెట్టవా బంగారం అని అడిగితే నాతో పాటు అందరికీ తలో స్పూను నోటిలో పెట్టి చిట్టితల్లి చెప్పిన మాట..థ్యాంక్యూ నాన్న.!
ఉదయం వానను చూసి ఏంటిది పొద్దునే అనుకున్నాను..కానీ ఆ వానవల్లనే ఒక పూటంతా కుటుంబంతో గడిపే అవకాశం దొరికింది. ఆ వానతోనే సగం ఆఫీసుపని ఇంట్లోనే పూర్తయ్యింది.ఆలస్యంగా వెళ్లినా సమయానికి పని జరిగింది..మనసులోని ఒత్తిడి మొత్తం ఆ చినుకుల్లో కరిగిపోయింది.చిన్న చిన్న సరదాలకు, అమ్మానాన్నలకు సమయం కేటాయించలేని ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈరోజుని వర్షం మార్చింది.నాకంటూ కొంత సంతోషాన్ని ఇచ్చింది..అప్పుడనిపించింది.."నాతోన ఈవాన ఎప్పుడూ ఇలానే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా.".!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి