జార్జ్ వాషింగ్టన్ కార్వెర్... అమెరికా శాస్త్రవేత్త! కార్వెర్ ని "వేరుశెనగ పరిశ్రమ పితామహుడి" గా చెప్తుంటారు. వేరుశెనగలో వందల రకాలు కనుగొన్న కార్వెర్ అలబామాలో పుట్టిపెరిగినట్లు చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన జన్మించింది మిస్సౌరీలోని డైమండ్ గ్రోవ్ అనే ప్రదేశంలో.
పంటభూములపై గట్టి పట్టున్న కార్వెర్ రకరకాల వేరుశెనగలను సాగు చేస్తుండే వారు. విజయమూ సాధిస్తుండేవారు.
లోవా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ కార్వెర్! ఇదే విశ్వవిద్యాలయం నుంచి బ్యాచులర్, మాష్టర్ డిగ్రీలు పొందిన ఈయనకు అలబామాలోని టస్కెగీ విశ్వవిద్యాయంలో ఉద్యోగం లభించింది. వ్యవసాయ విభాగానికి డైరెక్టరుగా ఉండమని కోరారు.
1916లో ఆయన వేరుశెనగ సాగుపై ఓ పరిశోధనాత్మక వ్యాసం రాశారు. రకరకాల వేరుశెనగలను ఎలా సాగు చేసి లబ్ధి పొందవచ్చో ఆయన విశదంగా తెలిపారు.
షాంపూ పెయింట్, కాఫీ వంటివాటి తయారీలో వీటినెలా వాడవచ్చునో వివరించారు. వేరుశెనగ గురించే కాకుండా అలబామా క్లే, స్వీట్ పొటాటోస్ లకు సంబంధించి కూడా ఆయన కొత్త కొత్త ప్రయోగాలు చేశారు.
వ్యవసాయం, పౌష్టికాహారానికి సంబంధించి ఆయన మహాత్మా గాంధీతోనూ చర్చించి సూచనలు చేయడం విశేషం.
ఆయన పేరిట ఓ జాతీయ పార్క్ ఉండటం గమనార్హం. ఓ ఉద్యానవనానికి ఓ ఆఫ్రో అమెరికన్ పేరు పెట్టడం అమెరికాలో అదే మొదటిసారి. మిస్సౌరీలో ఈ ఉద్యానవనముంది.
ఆయన శాస్త్రవేత్త మాత్రమే కాదు. పియానో వాయించేవారు. చిత్రకళలలోనూ అందె వేసిన చేయి ఆయనది. ఆయన కృషిని మార్టిన్ లూదర్ కింగ్ ఎంతగానో కొనియాడారు. 1893లో ఆయన పెయింటింగ్సుని వరల్డ్ ఫెయిర్లో ప్రదర్శించారు.
హెన్రీ ఫోర్డ్ "పియనట్ రబ్బర్" తయారీకీ కార్వెర్ తనవంతు సహాయం చేశారు.
మోసస్, సుసన్ దంపతులకు జన్మించిన జార్జ్ వాషింగ్టన్ కార్వెర్ కు ఓ సోదరుడు ఉన్నాడు. ఆయన పేరు జేమ్స్. ప్రాథమికంగా కార్వెర్ కి చదవటం, రాయటం నేర్పిందంతా తల్లి సుసన్. స్థానికంగా ఉన్న స్కూళ్ళల్లో ఆ రోజుల్లో ఆఫ్రో అమెరికన్లకు చదువుకునే అవకాశం ఉండేది కాదు.
తన పరిశోధనల ద్వారా ఉద్యోగం ద్వారా ఎంతో డబ్బుని గడించిన కార్వెర్ డెబ్బై అయిదు వేల డాలర్లను ఓ బ్యాంకులో ఖాతా తెరచి అందులో జమ చేసారు. అయితే ఆ బ్యాంక్ కాస్తా దివాళా తీసింది. ఆయన డబ్బులు పోయాయి. ఈ విషయాన్ని ఓ మిత్రుడొచ్చి కార్వెర్ తో చెప్తారు.
అప్పుడు కార్వెర్ "మిత్రమా! అంత డబ్బుని ఎలా వినియోగించాలో తెలియకే బ్యాంకులో కట్టాను. ఉపయోగించడం తెలీని ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలిసిన వారి పరమైంది. పోనివ్వు. వారైనా సద్వినియోగం చేస్తే చాలు" అని చెప్పారు తప్ప డబ్బు పోయినందుకు కించిత్ కూడా బాధ పడలేదు.
1864లో పుట్టిన జార్జ్ వాషింగ్టన్ కార్వెర్ 1943 జనవరి అయిదో తేదీన తుదిశ్వాస విడిచారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి