ఓ భారతీయులారా....!; - కోరాడ నరసింహా రావు.
 ఘనమైనవి  మన సనాతన 
 సాంప్రదాయాచారాలు !
 ప్రపంచానికే ఆదర్శమైనది... 
మనహిందూవైవాహికవ్యవస్థ!!
ధర్మార్ధకామములలో కడదాకా 
 కలిసేఉంటామని,తాళిబొట్టుకు మూడుముళ్ళువేసి...ఇరు తనువులకూ ప్రతీకలైనపసుపు పొత్తులకు భ్రహ్మ ముడులువేసి 
పదుగురి ఎదుట అగ్ని సాక్షిగా 
 పరిణయమాడి,ఏడడుగులు నడచి పాణిగ్రహణంతో  ఆలూ మగలై,సంతానోత్పత్తితోఉత్తమ
మానవసమాజాభివృద్ధికిబాధ్యతాయుతంగా   చెరి సగమయ్యే మన హిందూ వైవా హిక వ్యవ స్థను మించిన గొప్ప విధానము ఈప్రపంచమున వేరొకటున్నదా
     ఉత్తమ నాగరిక విలువలకు
పుట్టినిల్లు మనపవిత్ర   భారతా వని  !
    మనమాచరించే ప్రతి ఆచార మూ...సమాజ వికాస ప్రేరకము 
   ఎండమావి వంటి  పాశ్చాత్య ప్రభావమునకు లోనై...జీవనది వంటి మనసంస్కృతిని నిర్లక్ష్యం
చెయ్యటం అవివేకమే కదూ !
 
    ఓ భారతీయులారా... !
 కొత్త మోజులోపడి, మన పాత 
    సాంప్రదాయాలనుచేదనుకో
కండి !
   ఈచేదులో ఉండేసుగుణాన్ని
ఇదిఇచ్చే ఆరోగ్యాన్నీ, ఆనం దాన్నీ  గుర్తించండి !
         తల్లిపాలనువీడి...డబ్బా
పాలవెంటపరుగులుతీయకండి
         *******

కామెంట్‌లు