ఆరోజు క్లాస్ టీచర్ సెలవు పెట్టడంతో పి.టి.కొత్త టీచర్ వచ్చింది. "మీ క్లాస్ వర్క్ చేసుకోండి"అని టీచర్ చెప్పగానే రాయని హోంవర్క్ చేస్తూ స్లిప్ టెస్ట్ కి చదువుతూ కొంత మంది మాత్రమే చదువులో మునిగారు.మిగతా వారంతా గుసగులాడుకున్నారు. పావుగంట చూసి టీచర్ వారిని నించోపెట్టి చెవులు పట్టుకుని గుంజీలు తీయించింది.పావుగంట కే వారు అలసిపోయారు."గుంజీలు తీయటం పనిష్మెంట్ కాదు. అందులో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి.మనపూర్వీకులు ఎంతో ఆలోచించి వినాయక చవితి రోజు తప్పక గుంజీలు తీయిస్తారు.తమిళ తంబీలు తప్పక గుడిలో సిగ్గుపడకుండా వృద్దులతో సహా ఈవ్యాయామం చేస్తారు. దీని వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మస్తిష్కంలోని అన్ని భాగాలు యాక్టివేట్ అవుతాయి. జ్ఞాపకశక్తి పెరుగు తుంది. ఆక్యుప్రెషర్ లా పనిచేసి పిట్యూటరీ గ్లాండ్ చురుగ్గా ఉంటుంది. ఇది సూపర్ బ్రెయిన్ యోగా!ఇన్ని లాభాలు ఉండబట్టే చాలా దేశాలలో డాక్టర్లు కూడా వ్యాయామం గా రోజూ చేయమని చెప్తున్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అనే పేరు తో పిలుస్తున్నారు. వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. మీఇంట్లో వారి చేతకూడా చేయించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెదడు చురుగ్గా ఉంటుంది. ఇవ్వాళ సాయంత్రం గేమ్స్ పీరియడ్ లో చేయిస్తాను."అంతే మిగతా పిల్లలు కూడా ఎవరికి తోచినంత వారు గుంజీలు తీశారు.ఇలా ఆటీచర్ రోజూ ప్రేయర్ కి ముందు గేమ్స్ క్లాస్ లో గుంజీలు తీయించటంతో అందరిలో అపోహ తొలిగిపోయింది.మనపెద్దలు పెట్టిన పద్ధతులు అన్నీ మంచివే🌹
గుంజీలు! అచ్యుతుని రాజ్యశ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి