జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తొలి రోజుల గురించి ఇయాన్ కెర్షా ఓ పుస్తకం రాశారు. అందులోంచి....
1919లో నాజీ పార్టీ నిర్వహించిన ఓ చిరు సభలో హిట్లర్ తొలి సారిగా వేదిక ఎక్కి ప్రసంగించారు. ఈ సభకు వంద మంది హాజరయ్యారు. కానీ అనతికాలంలోనే హిట్లర్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకున్నారు. మరో నాలుగు నెలల తర్వాత ఆయన మాట్లాడిన సభకు రెండు వేల మంది తరలివచ్చారు.
నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన సొంతంగా ఓ పత్రిక ఆరంభించారు. యాభై అయిదు వేల మంది చందాదారులుగా చేరి సేవాదళంలో సభ్యులయ్యారు.
వేదిక ఎక్కినప్పుడు హడావుడి చేయడం హిట్లర్ కు ఉన్న అలవాట్లలో ఒకటి. ఓమారు ఆయన తన ప్రసంగాన్ని ముగించుకుని వేదిక దిగి బరువు చూసుకుంటే ఏకంగా అయిదు పౌండ్లు తగ్గారట. వేదికమీద ఉన్నంతసేపూ కనీసం ఇరవై సీసాల మినరల్ వాటర్ తాగారట హిట్లర్.
ప్రభుత్వ ఫైళ్ళను పరిశీలించడంలో హిట్లర్ మహా బద్ధకిస్టు. మంత్రులకు నోటితోనే ఆదేశాలు జారీ చేస్తుండేవారు.
మధ్యాహ్నం మూడు గంటల వరకూ నిద్రపోయి అన్నం తిన్న తర్వాత తోటలో విహరించేవారు. ఓ సినిమా చూసాక ప్రభుత్వ పనులు మొదలుపెట్టేవారు. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూనే ఉండేవారు. మంత్రులకు ఆవలింతలు వచ్చినా కానీ వారు ఎంతసేపన్నట్లుగా గడియారం వంక చూసినా కానీ హిట్లర్ పట్టించుకునేవారు కాదు. తన మాటలను ఎప్పటికో తప్ప ఆపేవారు కాదు.
ఇక హిట్లర్ గురించి పుస్తకం రాసిన సర్ ఇయాన్ కెర్షా వివరాల్లోకెళ్తే...
ఇంగ్లండుకు చెందిన ప్రముఖ చరిత్రకారులలో ఈయన ఒకరు. 1943 ఏప్రిల్ 29న జన్మించిన కెర్షా
జర్మన్ సామాజిక చరిత్రకు సంబంధించి విస్తారమైన అధ్యయనం చేశారు. ఆయన భార్య పేరు డేమ్ బెట్టీ కెర్షా. కెర్షా దంపతులకు ఇద్దరు పిల్లలు.
బిబిసి రూపొందించిన అనేక డాక్యుమెంటరీలకు ఈయన చారిత్రక సలహాదారుడిగా పని చేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి