చిరునవ్వు పెదవులపై
చిరంజీవిగా నిలవాలి
ధైర్యం మనసులో
స్థిరంగా వుండాలి
ఆలోచన మెదడులో
స్ఫుటంగా వుండాలి
గమ్యం వేపు అడుగులు
ఆగకుండా సాగాలి
విజయం వేపు చూపు
ఏకాగ్రతగా చూడాలి
కంటకాలు తగిలినా
లెక్కచేయక కాళ్ళు సాగాలి
అలసట దరిచేరనివ్వని
ఉత్సాహం మదిలో వుండాలి
కాలం పట్ల ఓర్పు కలిగి
ఎదురు సాగాలి.
ఆశయం పట్ల అవగాహన
కలిగి వుండాలి.
అవకాశాలు అందిపుచ్చుకునే
తెలివితేటలు వుండాలి
క్షణం గడిస్తే తిరిగి రాదన్న
స్పృహ కలిగి వుండాలి
రేపటి కోసం ఎదురుచూసే
ఆశ వుండాలి.
మార్పును స్వాగతించే
మనసుండాలి
అరుణోదయ అనుగ్రహం
అపారంగా అందరిపై కురవాలి
అపురూపమైన క్షణాలనిచ్చే
అందమైన ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి