వసించు... వాసించు
******
మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనుకుంటే "వసించు..వాసించు".ఈ రెండు పదాలను సదా గుర్తుకు పెట్టుకుని ఆచరణలో చూపాలి.
వసించు అంటే నివసించు,ఉండు, నిలుచు,వర్తిల్లు లాంటి అర్థాలు ఉన్నాయి.
ఈ భూమ్మీద అందరం వసిస్తాం.కానీ ఎలా వసించాలి? అనేదే ముఖ్యం.ఎవరైనా మనల్ని తలవగానే ఆత్మీయమైన స్పందనతో కూడిన అభిమానం, ఆదర్శంగా తీసుకోవాలనే భావన కలగాలి.
అలా హృదయాల్లో చిరస్థాయిగా వసించాలంటే వాసించాలి.
మరి వాసించు అంటే ఏమిటో చూద్దాం. పరిమళించు,గమాయించు,గుబాళించు,రమాయించు,నిగ్గారు,వాసిల్లు అనే అర్థాలు ఉన్నాయి.
మంచితనం,మానవత్వం, పరోపకార తత్వంతో వాసిల్లే వారు తప్పకుండా ప్రాతఃస్మరణీయులై ఎదుటి వారి గౌరవాన్ని పొందుతారు. మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.
వసించు,వాసించు లోనే మన జీవితం, జీవన పరమార్థం ఉన్నాయనేది గ్రహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి