మన తెలుగునెలల పేర్లు...
తెలియునా మీకు పిల్లలూ ?
చైత్రముమొదలు...ఫాల్గుణము
వరకూ ఆరు ఋతువులతో...
అలరారే, పండ్రెండు తెలుగు
.నేలలు మనకున్నవి... !
చైత్రములోనే... మోడులన్ని
.చిగురించి, పచ్చదనముతో
ఆహ్లాదమును పంచును !
ఈ నెలలోనే... అమావాస్య
.చీకట్లను చీల్చుకు...కలియుగ
మ్ము మొదలైనది... !
ఆనందోత్సాహాలతొ మనము
ఆ యుగాదినే...ఉగాదిగా...
ఆనందోత్సాహాల పండుగ
జరుపుకొందుము... !!
ధర్మమునకు నెలవైన...
శ్రీరామచంద్రుని జననమును
కళ్యాణమును, భక్తి, శ్రద్ద లతొ
జరుపుచుందుము... !
మన రెండవనెల వైశాఖ మాసము...!
జగద్గురువు ఆదిశంకరులు...
ఈ నెలలోనే పంచమి నాడు...
పరమధర్మమును బోధించిన గౌతమ బుద్ధుడు పౌర్ణమినాడు
జన్మించి నారు... !
సేవానిరతికి ప్రతీకయైన
హనుమపుట్టినదీ ఈనెలలోనే
మన మూడవనెల... జ్యేష్ఠ
మాసము !
తదుపరి ఆషాడము... !!
వరలక్ష్మీ, మంగళగౌరీ వ్రతము
లతో అలరారే ఐదవ నెలయే
శ్రావణము !
రాఖీ పండుగ..., స్వాతంత్ర్య దినోత్సవాలు, ఈ నెలలోనే !
మనఆరవనెలయేభాద్రపదము
ఆదిపూజలందుకును గణేశ
నవరాత్రులు ఈ నెలలోనే... !
వెనువెంటనె ఆదిశక్తిఅమ్మను
నవదుర్గలుగా నవరాత్రులు
ఆరాధించి...విజయ దశమిగా
దసరాపండుగ చేసుకునే ఆశ్వ యుజ మాసము...!
మనతెలుగునెలలలోఎనిమిదవది,శివునికి అత్యంతప్రీతిపాత్ర మైనది కార్తీకమాసం...!
దీపావళి పండుగ మరునాడే మొదలౌనీ మాసం... !!
కేశవుని నియమ నిష్టలతో.... ఆరాధించు మార్గశిర మాసమే
మనతొమ్మిదవ తెలుగు నెల !
పడవది... పుష్యమాసం...,
ముచ్చటగా మూడురోజులు జరుపుకును సంక్రాంతి పండుగ
ఈ నెలలోనే... !!
తదుపరి వచ్చే మాఘమాసము
వివాహములకు శ్రేష్టమైన నెల !
దినకరుడు సూర్య భగవానుని
రధసప్తమి ఈ నెలలోనే... !!
మహాశివరాత్రి, హొలీ లతో...
ముగిసే మన చివరి తెలుగు నెల ఫాల్గుణ మాసం... !
మన పండ్రెండుతెలుగు నెలలూ
పండుగలు - పర్వదినములతో
ఆనందాన్ని కలిగించు... !
.ఉత్సాహమునే పెంచు... !!
మన తెలుగునెలల పేర్లూ...
మన పవిత్రమైన పండగలూ
తెలిసినవికదా పిల్లలూ....,
మీరూ పెద్దయినాక, మీపిల్లల కూ... తెలియజెప్పండి పిల్లలు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి