జంతువుల ఆలయాలు.. సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఏనుగు సింహం మొహం ఉన్న దేవుళ్ళని పూజిస్తాము.గుర్రంమొహం దేవుడు హయగ్రీవుడు.కేవలం మూగప్రాణులకై కట్టిన ఆలయాలున్నాయి.శివుని వాహనం నంది.శివలింగం ఎదురుగా దర్శనం ఇస్తాడు.బెంగుళూర్లోనందీశ్వర ఆలయం ఉంది. ఆనంది పాదాల కింద నుంచి నంది పారుతోంది అని జనం నమ్మకం! కేరళలోనిమన్నార్ సల ఆలయంలో ఒక లక్ష పాములు విగ్రహాలు శిల్పాలు ఉన్నాయి.సంతానంలేనివారు ఇక్కడికి వచ్చి పూజచేస్తారు.సంతానం కలగానే సర్పమూర్తిని అర్పించిమొక్కు తీర్చుకుంటారు. ఆరావళీకొండలమధ్య జైపూర్ సమీపంలో గలతాజీ ఆలయంలో సప్త కుండాలు ఉన్నాయి.రాళ్ళమధ్య ఉన్న వీటిలో ఒక కుండలో నీరు అస్సలు ఇంకిపోదు.ఋషి గాలవుడు తపస్సు చేసిన ఈప్రాంతంలో వందలాది కోతులు లంగూర్లు స్వేచ్ఛ గా  తిరుగుతాయి.రాజస్థాన్ లోని కరణీమాతా మందిరంలో మనతోపాటు ఎలుకలు ప్రసాదం తింటాయి.కరణీమాత ఎలుకరూపంలో పుట్టింది అనిఎలుకలను పూజిస్తారు.ఒక ఎందుకు చనిపోతే మళ్లీ ఆ గుడి లోనే పుడుతుంది అని అక్క డి వారి విశ్వాసం🌸
కామెంట్‌లు