దీపావళి పర్వము ;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
వరముల నిచ్చుచుండు రమ 
పద్మినియై ప్రభవించె నంబుధిన్
హరికిని పత్నిగానిలిచి హాళిగ నేలుచు తల్లి విశ్వమున్ 
సిరినిడు చుండు గేహముకు 
శోభను గూర్చుశుభప్రదంబుగన్./

ధరణికి భారమై చెలగు 
దైత్యుడు బాధలు పెట్టు చుండగా
సురలును మౌనులున్ జనులు శోకము నొందుచు తల్లడిల్లుచున్
శరణము కోర కృష్ణుడిని

సాయము చేసెద నంచు సత్యతో
నరిగెను శౌరి తా నుఱికె నాహవమందున విక్రమించుచున్
జరచర నాయుధమ్ములను సర్రున  వేయగ దైత్యుడుద్ధతిన్ 
హరి యట సొమ్మసిల్ల గని  యా రమణీమణి సత్య భామతాన్

శరముల దైత్యునిన్ గెలిచి సాహసరూపిణి సంహరించగన్
చిరుచిరు హాసముల్ చిలికి చిన్మయ రూపుడు సంతసించుచున్
నరకుని జన్మగాథనట నాతికి తెల్పెసవిస్తరంబుగన్ 
 సురలును మౌనులున్ మురిసి స్తోత్రము చేయుచు కొల్చిరా హరిన్ 

నరకుడు యంతమొందెనని నాట్యము సల్పగ నచ్చరాంగనల్ 
గురియగ పుష్పవర్షములు కూరిమి తో ప్రజ లెల్ల పొంగుచున్ 
మెరిసెడి దీపకాంతి మెయి 
 మేలుగ సల్పగ నుత్సవంబులన్/

నిరతము పెద్దలన్ గొలిచి నిష్ఠగ మెల్గుచు నుండు వారికిన్
తరగని సంపదల్ కలుగు 
దైవము ప్రక్కన తోడుగా చనున్
బరహిత మెంచు సజ్జనుల పావన వర్తనమీ జగంబుకున్
సరియగు దారి


చూపునిట
సత్యము ధర్మము శాంతియున్ సదా
నిరవుగ వర్థిలున్ ప్రజల కీవిధి నీతిని నేర్పుచుండగన్ //
----------------------------
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం