మార్పుకావాలి!;-చంద్రకళ యలమర్తి

 మార్పు అంటే అభివృద్ధి!
మార్పు అంటే పరిణితి!
మార్పు అంటే పరిపూర్ణత!
మార్పు ఆంటే రాయి రత్నం కావడం!
మార్పు ఆంటే శిల శిల్పం కావడం!
మార్పు ఆంటే మొగ్గ పువ్వుగా వికసించడం!
మార్పు ఆంటే ఒక వానచుక్క ముత్యం కావడం!
నీటిని విద్యుత్తు గా మార్చడం!
మార్పు తో మనిషి మనీషి అయ్యాడు!
 మార్పు అనివార్యం తరం తరం నిరంతరం మారుతూ ఉంటుంది!
మార్పు అందంగా ఉంటుంది!
గొంగళీ పురుగు సీతాకోక చిలుకగా మారడం సృష్టిలోజరిగే అత్యద్భుతం!
మార్పు అద్భుతాలనుసృష్టిస్తుంది!
 అడవుల్లో నివసించే మానవుడు
 మారాడు  నాగరికత నేర్చాడు!
కొండలు గుహలు విడచివలస
పోయాడు!
నగరాలను ఆకాశ హర్మ్యాలను
ఎన్నో వింతలను నిర్మించాడు!
మారాలనే ఆలోచనతో సైన్స్
ఎంతో అభివృద్ధి చెందింది!
నేలపైనుండి నింగికి ఎగిరాడు!
చంద్ర మండలంపై కాలుమోపాడు!
ఆదిమ మానవుడి నుండి ఆధునిక మానవునిగా ఎదిగాడు!
ఎన్నో సౌకర్యాలను, విలాశాలను
తనకోసం సృష్టించుకున్నాడు!
సువిశాల ప్రపంచాన్ని కైవసం చేసుకున్నాడు కాని అతని
మనస్సు సంకుచితమై పోయింది! అంతః కరణం లోమార్పు రావాలి!
విశాల హృదయం కావాలి!
 నావి, నాది అని దోచుకునే స్వార్ధమునే విడిచిపెట్టు దిశగా మార్పు రావాలి!
**

కామెంట్‌లు