మరక లేని మహనీయుడు
మనసులోన ఆరాధ్యుడు
మన లాల్ బహుదూర్ శాస్త్రి
ఘన స్వాతంత్ర్య యోధుడు
భారత దేశపు రెండవ
ప్రధాన మంత్రి అయినారు
ఆత్మాభిమానంతో
పదవినే త్యజించినారు
స్వాతంత్ర్యోద్యమంలో
అతిముఖ్య పాత్ర ధారి
నైతిక విలువలున్నోడు
మన్ననలకు సరైనోడు
నమ్మకస్తుడైన వాడు
శాస్త్రి వంటి వాడు లేడు
"జై జవాన్,జై కిసాన్" అని
నినదించిన మగధీరుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి