సీ.
నిరుపమానంబైన నీ కీర్తి దర్శించి
రజతాచలము డిగ్గి రాజికొచ్చె
నిండైన మెండైన నీ దయన్వీక్షించి
సంద్రమ్ము చేసాచి సంధి నడిగె
నిష్కల్మషంబైన నీ నవ్వు దిలకించి
కౌముది పులకించి కౌగిలించె
నిక్కచ్చియై వెల్గు నీ యాత్మబలమెంచి
తెల్లదొరతనమే తల్లడిల్లె
తే.గీ.
శాంత్యహింసల సాగు నీ సమరము గని
ఇంద్రజాలమ్ము తన కనులింత జేసె
సత్యశోధన సాధన నిత్యమైన
బాపు!మానవజాతి నీ ప్రాపు గోరె
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి