ఒకప్పుడు మా అమ్మ ముందు
కూర్చుని వెక్కిరించడం అననుగానీ
ఏంటమ్మా పళ్ళన్నీ ఊడిపోయాయి నీకూ...నోరలా కదలుతూనే ఉంటాయి అని ఆ కదలికను అనుకరించి చూపించాను...నవ్వొచ్చేది.
కానీ తెలిసొచ్చిందేమిటంటే
నాకు ముప్పై రెండు పళ్ళల్లో ఒక్కొక్కటీ ఊడుతూ ఇప్పుడు ఓ పన్నెండో ఎన్నో మిగిలాయి. నోరారా నవ్వడమనేది మానేశాను. కారణం నోరు తెరిస్తే బోసిపోయి కనిపిస్తుందని ముసిముసి నవ్వులతో సరి.
అలాగే నాకు తెలిసిన ఓ పెద్దాయన అటూ ఇటూ ఊగుతూ నడుస్తుంటే నవ్వొచ్చేది...ఏంటీ తిన్నగా నడవరా ఏమిటీ అని అనుకునే వాడిని. అలా నడిచే కన్నా ఇంటిపట్టున కూర్చోవచ్చుగా అనుకునే వాడిని.
ఇక మోకాళ్ళ నొప్పితో అందులోనూ ముఖ్యంగా ఎడమమోకాలి నొప్పితో తిన్నగా నడవటమనేది పోయింది. అటో ఇటో వాలి నడవటం. నిటారుగా నడవడానికి ప్రయత్నించానో నొప్పెక్కువవుతుంది. అలాగే చేతిలో బరువుంటే ఇక తకధినతోమే...ఒకప్పుడు పది నిముషాల్లో నడిచే దూరాన్ని ఇప్పుడు అర గంట పడుతోంది.
ఈ రెండింటి వల్ల ఎవర్నీ వెక్కిరించ కూడదనే పాఠం నేర్చుకున్నాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి